Breaking News

Daily Archives: December 6, 2017

భారతరత్న అంబేడ్కర్‌కు ఘన నివాళి

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌ చేసిన సేవలు ఎనలేనివన్నారు. బడుగు, బలహీన వర్గాల వెనుకబాటు తనాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించి వారి ఎదుగుదలకు దోహదపడ్డారన్నారు. అంబేడ్కర్‌ చూపిన బాటలో నేటి యువత నడుచుకోవాలని ...

Read More »

అంబేడ్కర్‌ ఆశయ సాధనలో నడవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కామరెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రాసి వారి పక్షాన నిలిచారన్నారు. ఆయన కారణంగానే బడుగు, బలహీన వర్గాలు నేడు రిజర్వేషన్‌ ...

Read More »

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు చేసిన జానపద, సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ జానపద గేయాలపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వారు చేసిన నృత్యాలు అబ్బురపరచాయి. ఆహుతులు వాటిని తిలకించి మంత్రముగ్దులయ్యారు. విద్యార్థులను అభినందించారు.

Read More »

పోటీతత్వంతో పది పరీక్షలకు సన్నద్దం కావాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి ఆలోచనలు, పోటీ తత్వంతో పదవ తరగతి పరీక్షలకు సన్నద్దం కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బాన్సువాడలో బుధవారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనకబడిన తరగతులు, గిరిజన అభివృద్ది శాఖలు ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, పరీక్షల శిక్షణ శిబిరానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో, పాజిటివ్‌ ఆలోచనలతో పరీక్షలకు సన్నద్దం కావాలని చెప్పారు. భయం, కోపం, ఒత్తిడి ఉన్నచోట ...

Read More »

అబ్బుర విద్య, వైజ్ఞానిక ప్రదర్శన

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ పాఠశాలలో బుధవారం ప్రారంభమైన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన అబ్బురపరచింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. సైన్స్‌ఫేర్‌ను తిలకించేందుకు వచ్చిన వారికి వాటి గురించి వివరించారు. కాలుష్య నివారణ, మొక్కల పెంపకం, బయో గ్యాస్‌, స్వచ్చభారత్‌, పారిశ్రామిక విధానం తదితర నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ...

Read More »

అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలైన రైతు మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిరికొండ మండలం రావుట్ల తాండాకు చెందిన రైతు గోగుల శ్రీనివాస్‌ (38) తన పొలంలో ఎండుగడ్డికి నిప్పంటించాడు. అదే సమయంలో శ్రీనివాస్‌కు ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు, కుటుంబీకులు శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు సిరికొండ ఎస్‌ఐ ...

Read More »

అంబేడ్కర్‌కు ఘన నివాళి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారతీయ వంజరి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఫూలాంగ్‌ చౌరస్తాలోగల అంబేడ్కర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కరిపె రాజు మాట్లాడుతూ భారతరత్న, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేడ్కర్‌ అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వంజరి కులస్తులు కోల్పోయిన ఎస్‌టి రిజర్వేషన్‌ తిరిగి సాధించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో వంజరి సంఘం నాయకులు గంగోనె సుజిత్‌, కృష్ణ, ...

Read More »

జనవరి 7న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 7వ తేదీ ఆదివారం రోజున పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు దాసరి నర్సింలు తెలిపారు. బుధవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 7న జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో జరిగే పరిచయ వేదికను పద్మశాలి కులస్తులందరు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి పద్మశాలి కులస్తులకు పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు ఆయన ...

Read More »

పిడిఎస్‌యు నూతన కార్యవర్గం ఎన్నిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు నూతన కార్యవర్గాన్ని బుధవారం నగరంలోని వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఎన్నుకోవడం జరిగింది. పిడిఎస్‌యు 21వ మహాసభలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సి.హెచ్‌. కల్పన, ప్రధాన కార్యదర్శిగా గౌతం కుమార్‌, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్‌, నరేందర్‌, రాజేశ్వర్‌, సహాయ కార్యదర్శులుగా సంతోష్‌, కార్తీక్‌, వై.ఆకాశ్‌, కోశాధికారిగా ప్రియాంకలతో పాటు 16 మంది సభ్యులుగా, 9 మందిని ఆఫీస్‌ బేరర్స్‌గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం పిడిఎస్‌యు రాష్ట్ర ...

Read More »

దేశానికి మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్‌

  – నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ అని నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఫూలాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ దేశంలో సామాజిక తారతమ్యాలు తొలగించడానికి అంబేడ్కర్‌ అహర్నిశలు కృషి చేశారని, ఎంతో శ్రమించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని మనకు ...

Read More »

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

  – బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు నడవాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 61వ వర్ధంతిని పురస్కరించుకొని దళిత మోర్చా ఆధ్వర్యంలో స్థానిక పూలాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ అంబేడ్కర్‌ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారని, దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మహిళ సాధికారికతకు ...

Read More »

మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బొడ్డెమ్మ చెరువు వద్ద కొలువుదీరిన మహాగణపతి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తమ మెట్టినిల్లు, పుట్టినిల్లు సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఉపవాసాలు చేశారు. వారికి రాత్రి 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉపవాస దీక్షలు విరమింపజేస్తారని ఆలయ ఛైర్మన్‌ నాగభూషణ చారి తెలిపారు. భక్తులకు ఎలాంటి ...

Read More »