Breaking News

అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలైన రైతు మృతి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిరికొండ మండలం రావుట్ల తాండాకు చెందిన రైతు గోగుల శ్రీనివాస్‌ (38) తన పొలంలో ఎండుగడ్డికి నిప్పంటించాడు. అదే సమయంలో శ్రీనివాస్‌కు ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు, కుటుంబీకులు శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు సిరికొండ ఎస్‌ఐ బషీర్‌ అహ్మద్‌ తెలిపారు. మృతునికి ముగ్గురు కూతుళ్ళు, కుమారుడు ఉన్నట్టు సమాచారం.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *