Breaking News

దేశానికి మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్‌

 

– నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ అని నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఫూలాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ దేశంలో సామాజిక తారతమ్యాలు తొలగించడానికి అంబేడ్కర్‌ అహర్నిశలు కృషి చేశారని, ఎంతో శ్రమించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని మనకు అందజేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ద్వారా నేడు వారు సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎనుగందుల మురళి, ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి, తెరాస ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు నీలగిరి రాజు, దళిత సంఘాల నాయకులు చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *