Breaking News

అంబేడ్కర్‌ ఆశయ సాధనలో నడవాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కామరెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రాసి వారి పక్షాన నిలిచారన్నారు. ఆయన కారణంగానే బడుగు, బలహీన వర్గాలు నేడు రిజర్వేషన్‌ పరంగా అభివృద్ది చెందగలుగుతున్నాయని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు మరింతగా అభ్యున్నతి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్సీ సుధాకర్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఆర్డీవో శ్రీను, మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థులను అడిగి వారు ప్రదర్శించిన అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *