Breaking News

అంబేడ్కర్‌కు ఘన నివాళి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారతీయ వంజరి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఫూలాంగ్‌ చౌరస్తాలోగల అంబేడ్కర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కరిపె రాజు మాట్లాడుతూ భారతరత్న, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేడ్కర్‌ అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వంజరి కులస్తులు కోల్పోయిన ఎస్‌టి రిజర్వేషన్‌ తిరిగి సాధించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో వంజరి సంఘం నాయకులు గంగోనె సుజిత్‌, కృష్ణ, లక్ష్మణ్‌, గంగాశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *