అబ్బుర విద్య, వైజ్ఞానిక ప్రదర్శన

 

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ పాఠశాలలో బుధవారం ప్రారంభమైన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన అబ్బురపరచింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. సైన్స్‌ఫేర్‌ను తిలకించేందుకు వచ్చిన వారికి వాటి గురించి వివరించారు. కాలుష్య నివారణ, మొక్కల పెంపకం, బయో గ్యాస్‌, స్వచ్చభారత్‌, పారిశ్రామిక విధానం తదితర నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్సీ సుధాకర్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఆర్డీవో శ్రీను, మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థులను అడిగి వారు ప్రదర్శించిన అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *