Breaking News

జనవరి 7న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 7వ తేదీ ఆదివారం రోజున పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు దాసరి నర్సింలు తెలిపారు. బుధవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 7న జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో జరిగే పరిచయ వేదికను పద్మశాలి కులస్తులందరు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి పద్మశాలి కులస్తులకు పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌ తర్ప అభ్యర్థులు, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో పద్మశాలి సంఘం ప్రతినిదులు మద్ద అబ్బయ్య, ముదిగొండ మనోహర్‌, రాజన్న, పరంధాములు, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *