Breaking News

భారతరత్న అంబేడ్కర్‌కు ఘన నివాళి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌ చేసిన సేవలు ఎనలేనివన్నారు. బడుగు, బలహీన వర్గాల వెనుకబాటు తనాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించి వారి ఎదుగుదలకు దోహదపడ్డారన్నారు. అంబేడ్కర్‌ చూపిన బాటలో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ఆయాపార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *