Breaking News

పిడిఎస్‌యు నూతన కార్యవర్గం ఎన్నిక

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు నూతన కార్యవర్గాన్ని బుధవారం నగరంలోని వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఎన్నుకోవడం జరిగింది. పిడిఎస్‌యు 21వ మహాసభలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సి.హెచ్‌. కల్పన, ప్రధాన కార్యదర్శిగా గౌతం కుమార్‌, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్‌, నరేందర్‌, రాజేశ్వర్‌, సహాయ కార్యదర్శులుగా సంతోష్‌, కార్తీక్‌, వై.ఆకాశ్‌, కోశాధికారిగా ప్రియాంకలతో పాటు 16 మంది సభ్యులుగా, 9 మందిని ఆఫీస్‌ బేరర్స్‌గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ప్రదీప్‌ కుమార్‌ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *