అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

 

– బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు నడవాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 61వ వర్ధంతిని పురస్కరించుకొని దళిత మోర్చా ఆధ్వర్యంలో స్థానిక పూలాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ అంబేడ్కర్‌ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారని, దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మహిళ సాధికారికతకు నిరంతరం శ్రమించి వారి హక్కులను, అధికారాలను సాధించిపెట్టిన ఘనత డాక్టర్‌ అంబేడ్కర్‌దేనని కొనియాడారు.

 

బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ బాబాసాహెబ్‌కు సంబంధించిన ఐదు క్షేత్రాలను, ఆయన చదివిన, పెరిగిన, దీక్ష పొందిన స్థలం, నివాసం, సమాధి మండలంను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని స్మారకకేంద్రంగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో దళిత మోర్చా ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కానీ స్వరాష్ట్రంలో దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

 

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బస్వ లక్ష్మినర్సయ్య, మహిళా మోర్చా నాయకులు గీతరెడ్డి, నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్‌, శైలజ, కల్పన ఠాకూర్‌, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రషీద్‌, బిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *