మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బొడ్డెమ్మ చెరువు వద్ద కొలువుదీరిన మహాగణపతి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తమ మెట్టినిల్లు, పుట్టినిల్లు సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఉపవాసాలు చేశారు. వారికి రాత్రి 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉపవాస దీక్షలు విరమింపజేస్తారని ఆలయ ఛైర్మన్‌ నాగభూషణ చారి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన తెలిపారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *