పోటీతత్వంతో పది పరీక్షలకు సన్నద్దం కావాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి ఆలోచనలు, పోటీ తత్వంతో పదవ తరగతి పరీక్షలకు సన్నద్దం కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బాన్సువాడలో బుధవారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనకబడిన తరగతులు, గిరిజన అభివృద్ది శాఖలు ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, పరీక్షల శిక్షణ శిబిరానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో, పాజిటివ్‌ ఆలోచనలతో పరీక్షలకు సన్నద్దం కావాలని చెప్పారు. భయం, కోపం, ఒత్తిడి ఉన్నచోట ఆలోచన చేయలేమని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని, వాటిని దరి చేరకుండా చూసుకోవాలన్నారు. ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలకు సన్నద్దం కావాలని చెప్పారు. పరీక్షల సమయం 12 వారాలు ఉందని, ఈ సమయాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, ఎస్‌సి సంక్షేమాధికారి అంజయ్య, సహాయ బిసి సంక్షేమాధికారి కేశవులు, సహాయ ఎస్‌టి సంక్షేమాధికారి శంకరయ్య, బిసి సంక్షేమశాఖాధికారి నర్సింహరావు, రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *