Breaking News

Daily Archives: December 7, 2017

సంగెం గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బిపి, షుగర్‌ నిర్దారణ పరీక్షలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సంగెం గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ బీర్కూర్‌, ప్రసాద్‌ ప్యాథలాజికల్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌ వారి సహకారంతో నెహ్రూ యువకేంద్ర సంఘటన, సేవా ఫ్రెండ్స్‌ యూత్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత బిపి మరియు షుగర్‌ పరీక్షా నిర్దారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రానికి ముఖ్య అతిథిగా బీర్కూర్‌ జడ్పిటిసి కిషన్‌ నాయక్‌ మాట్లాడుతూ ఇలాంటి వైద్య పరీక్ష కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ...

Read More »

9న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 9న కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నట్టు పట్టణ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. 9న సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని డిగ్రీ కళాశాల మైదానం నుంచి ఫంక్షన్‌ హాల్‌ వరకు శాసన మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ నాయకత్వంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు దీనికి భారీగా హాజరుకావాలని ...

Read More »

యాసంగిలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి యాసంగిలో మొత్తం 2.10 లక్షల ఎకరాలకు సాగునీరుఅందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ప్రాజెక్టు వద్దకెళ్లి పరిశీలించి నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు లేదా ఏడు విడతలుగా నీటిని విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి కాళేశ్వరం ...

Read More »

విఠల్‌ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు

  గాంధారి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ తాండా పట్టణ అధ్యక్షుడు విఠల్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు. గత రెండురోజుల క్రితం తండాకు చెందిన విఠల్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా అతని కుటుంబాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌ మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్‌ పార్టీ విఠల్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విఠల్‌ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ...

Read More »

విద్యార్థులు నేర్చుకోవాలనే తపన పెంచుకోవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ప్రతినిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన పెంచుకోవాలని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి అన్నారు. గురువారం ఆమె కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు. అన్ని స్టాళ్లను పరిశీలించారు. అక్కడి విద్యార్థులను అడిగి వారు రూపొందించిన నమూనాలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. నిత్యం కొత్తవి నేర్చుకుంటు ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Read More »

రోగరహిత తెలంగాణే లక్ష్యంగా పాలన

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోగ రహిత తెలంగాణయే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ 40 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల 678 ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందించడానికి మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం సింగూరు ప్రాజెక్టు వద్ద మిషన్‌ భగీరథ పనులను ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడపూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ...

Read More »

బహిరంగసభ విజయవంతం చేయండి

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లా కేంద్రంలో ఈనెల 9న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మైనార్టీ ప్రతినిధులు కోరారు. జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్‌ హాల్‌లో జమాతె ఇలేమా హింద్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా బెంగుళూరుకు చెందిన మౌలానా సి. ఎం. ముజమల్‌తోపాటు ముక్తీమహమద్‌, జువేర్‌లు రానున్నట్టు తెలిపారు. కనుమరుగవుతున్న మానవ విలువలతోపాటు మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని అందించేందుకు సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముస్లింలు ...

Read More »

వైభవోపేతంగా అయ్యప్ప పడిపూజ

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌ ప్రాంగణంలో బుధవారం రాత్రి అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కేరళ నుంచి వచ్చిన పూజారులు, గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు వేలాదిగా పూజలో పాల్గొన్నారు. మహిళలు సైతం వేల సంఖ్యలో పూజకు తరలివచ్చారు. కేరళలోని అయ్యప్ప దేవాలయం మాదిరిగా సెట్టింగ్‌ వేసి మెట్లను ఏర్పాటు చేసి అయ్యప్పను ప్రతిష్టించి కన్నుల పండువగా పడిపూజ నిర్వహించారు. గణపతిహోమం, అష్టాభిషేకం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ...

Read More »