సంగెం గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బిపి, షుగర్‌ నిర్దారణ పరీక్షలు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సంగెం గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ బీర్కూర్‌, ప్రసాద్‌ ప్యాథలాజికల్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌ వారి సహకారంతో నెహ్రూ యువకేంద్ర సంఘటన, సేవా ఫ్రెండ్స్‌ యూత్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత బిపి మరియు షుగర్‌ పరీక్షా నిర్దారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రానికి ముఖ్య అతిథిగా బీర్కూర్‌ జడ్పిటిసి కిషన్‌ నాయక్‌ మాట్లాడుతూ ఇలాంటి వైద్య పరీక్ష కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ఎంతమందికి బిపి, షుగర్‌ ఉందో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర వాలంటీర్‌ సునీల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ ఇలాంటి వైద్య పరీక్ష కేంద్రాలు ఒక్క తమ గ్రామమే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య శిబిరానికి సుమారు 253 మంది పరీక్షల నిమిత్తం రాగా 70 మందికి పైగా షుగర్‌ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. అలాగే 110 మందికి అధిక బిపి ఉన్నట్టు తెలిసింది. 40 మందికి పైగా లో బిపి ఉన్నట్టు పరీక్షల్లో నిర్దారించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిదులు కిషోర్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ కిరణ్‌, గ్రామ సర్పంచ్‌ కాశిరాం, లాల్‌సింగ్‌, ఓంకార్‌, తారాచంద్‌, తదితరులున్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *