Breaking News

Daily Archives: December 8, 2017

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖల మండల స్థాయి అధికారులతో శుక్రవారం జనహిత భవనంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్‌ కిట్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు పరచడం పట్ల అధికారులను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలని సూచించారు. కాన్పులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని జిల్లా ఇమ్యునైజేషన్‌ …

Read More »

9న ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 9న ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం పురస్కరించుకొని కలెక్టరేట్‌ మైదానం నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు అవినీతి వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌ అవినీతి నిరోధక శాఖ సిఐ ఆర్‌.రఘునాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ అనంతరం కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని, అదే సందర్భంలో అవినీతి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ ఉంటుందని ఏసిబి సిఐ తెలిపారు. కార్యక్రమానికి ప్రజలందరు పాల్గొని అవినీతికి వ్యతిరేకంగా పోరాడే తమ …

Read More »

ఆత్మవిశ్వాసమే మనుగడకు మూలం

  – జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మవిశ్వాసమే మనిషి మనుగడకు మూలమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. దేవుడు మనుషులందరికి ఒకే జీవితాన్ని ఇవ్వడని, కొందరు ఏదో ఒక లోపంతో పుడతారని లోపం ఉన్నపుడే ఆత్మవిశ్వాసం విషయంలో రెట్టింపు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. లోపంగల పిల్లలు పుడితే తల్లిదండ్రులు మనస్తాపానికి గురికాకుండా …

Read More »

ఎల్‌ఇడి స్టాళ్లను ప్రారంభించిన మేయర్‌

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ఎల్‌ఇడి స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రజలందరు ఎల్‌ఇడి ఎలక్ట్రికల్‌ వస్తువులను వాడాలని, దీనివల్ల 50 శాతం వరకు విద్యుత్తు వినియోగం ఆదా అవుతుందని, అదనపు ఆర్థిక భారం పడకుండా ఉంటుందని ఆమె అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎల్‌ఇడి వస్తువుల ధరలు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ ఆకుల లలిత పుట్టినరోజు వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జిల్లా కేంద్రంలోగల స్నేహ సొసైటీలో ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆకుల లలిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీలోని పిల్లలకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అమరేందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, లింగారావు, ఆకుల నరేందర్‌, లచ్చారెడ్డి, పోశెట్టి, దయాకర్‌రావు, ఒడ్యాట్‌పల్లి గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తపాలా స్టాంపుల్లో దేశ చరిత్ర ఉంటుంది

  – జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తపాలా స్టాంపుల్లో దేశ చరిత్ర ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండ్రోజుల నిజాం పెక్స్‌-2017 ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 14 సంవత్సరాల తర్వాత తపాలా బిల్లల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని మన దేశ చరిత్రకు సంబంధించిన మహాత్ములు, ప్రసిద్ధ కట్టడాల స్టాంపులు విడుదల …

Read More »

అయ్యప్ప ఆలయంలో గణపతి హోమం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నగరంలోగల అయ్యప్ప స్వామి ఆలయంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు మహాపడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తండ్రి బిగాల కృష్ణమూర్తి స్వామి, అయ్యప్పస్వాములు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More »

కమ్యూనిటీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శుక్రవారం 46వ డివిజన్‌లోని గౌతం నగర్‌లో శ్రీవాసవీ ఆర్యవైశ్య సేవా సంఘం భవనం ప్రారంభించారు. అనంతరం 44వ డివిజన్‌లోగల దుబ్బ ప్రాంతంలో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిటీ భవనాల వల్ల డివిజన్‌లోని ప్రజలందరికి సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, కమ్యూనిటీ భవనాల వల్ల కాలనీలు, ప్రజల మధ్య సఖ్యత పెరుగుతుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో …

Read More »

మహిళల సాధికారత ద్వారానే సురక్షిత సమాజ నిర్మాణం

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సాధికారిత ద్వారానే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. క్రాస్‌ బౌ లయన్స్‌ సంస్థ ఫౌండర్‌ ట్రస్టీ మక్షి ఆమెతో పాటు ఐదుగురు సభ్యుల బృందం శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి 260 రోజుల్లో 3800 కి.మీ.ల నడక కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం కామారెడ్డిని సందర్శించారు. వీరు గత సెప్టెంబరు 15న నడక ప్రారంభించినట్టు తెలిపారు. వచ్చే మే మాసం వరకు కార్యక్రమం పూర్తవుతుందన్నారు. …

Read More »

ప్రకృతిని నాశనం చేయకుండా ముందు తరాలకు మంచి సమాజం అందిద్దాం

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహిరంగ మలమూత్ర విసర్జన చేసి ప్రకృతిని నాశనం చేయకుండా ముందు తరాలకు మంచి సమాజం అందించాలని దీనికి అందరు సహకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జనహిత భవనంలో జుక్కల్‌ మండలంలోని ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతోపాటు 60 మంది స్వచ్చభారత్‌లో పాల్గొన్న విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటింటా మరుగుదొడ్డి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మలవిసర్జన రహిత కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్చందంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. …

Read More »