Breaking News

Daily Archives: December 9, 2017

మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని పంచాయతీ కార్యదర్శులు సంధ్యారాణి, క్యాసప్ప, రఘుపతిరెడ్డి, ఎపివో సుదర్శన్‌లు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని గాలిపూర్‌ గ్రామంలో ఇంటి పన్ను వసూలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో డిసెంబరు నెలాఖరులోగా వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం మరుగుదొడ్లు బోర్గల్‌, ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో ఇంటర్‌నల్‌ క్రీడలు ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్‌ అథారిటి మైదానంలో సేపక్‌ తక్ర క్రీడలు ప్రారంభించారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆవరణలో రూ. 7 లక్షల సిడిపి నిధులలో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జెండా బాలాజీ ఆలయంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఖిల్లా రోడ్డులోగల సనా ...

Read More »

ఉచిత బిపి, షుగర్‌ నిర్దారణ వైద్య శిబిరం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని నాచుపల్లి గ్రామంలోని రాముల్లగుట్ట తాండాలో లయన్స్‌ క్లబ్‌ బీర్కూర్‌, ప్రసాద్‌ పాథలాజికల్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌ వారి సహకారంతో నెహ్రూయువకేంద్ర సంఘటన, శ్రీసేవా యూత్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత బిపి, షుగర్‌ పరీక్ష నిర్దారణ వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌వైకె వాలంటీర్లు సునీల్‌రాథోడ్‌ మాట్లాడుతూ ఒకమనిషి ఆరోగ్యంగా ఉన్నాడో లేదోనని డాక్టర్లు ముందుగా చూసేది బిపియేనని, దాన్ని బట్టి మనకు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో చెప్పగలుగుతారని, ...

Read More »

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ మండలం గుండారం గ్రామ పంచాయతీ పరిధిలోగల శాస్త్రినగర్‌ గ్రామంలో నిర్మల సదన్‌ వృద్ధాశ్రమంలో కేక్‌కట్‌చేసి పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

పాపం పసికందు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శనివారం హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను ఆసుపత్రి ఆవరణలో వదిలివేసిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తెలిపారు.

Read More »

వంజరి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోగల రావూజీ సంఘంలో వంజరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అఖిలభారతీయ వంజరి సేవాసంఘం, నిజామాబాద్‌ నగర సంఘం ఆధ్వర్యంలో జిల్లా వంజరి సంఘం కార్యవర్గం ఎన్నుకున్నట్టు అఖిలభారతీయ వంజరి సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరిపె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్‌, ఉపాధ్యక్షునిగా గంగోనె సరిత, వెంకటేశ్‌, నిజామాబాద్‌ యువజన జిల్లా అధ్యక్షునిగా నవాతె సురేశ్‌, ప్రధాన కార్యదర్శిగా ...

Read More »

క్లోరోహైడ్రేట్‌ స్వాధీనం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు అధికారులు శనివారం ధర్పల్లి మండల కేంద్రంలో కల్తీకల్లు ఉత్పత్తిలో వినియోగించే కిలో క్లోరోహైడ్రేట్‌, 3 కిలోల టఫ్‌ ఫౌడర్‌, 68 లీటర్ల కల్తీకల్లును స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌రమాకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ సింధు, హెడ్‌కానిస్టేబుల్‌ ఫయాజ్‌, మహేందర్‌, కానిస్టేబుళ్ళు రాజేశ్వర్‌, అమీద్‌ ఉన్నట్టు ఆయన తెలిపారు.

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర శివారులోగల 6వ టౌన్‌ పరిధిలోసారంగాపూర్‌ గ్రామం వద్ద, జన్నేపల్లి ఎక్స్‌రోడ్డు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్టు 6వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మృతునికి 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుందని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. రెండ్రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, మృతుడు ఆకుపచ్చ రంగు టీషర్టు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ప్రాథమికంగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని ...

Read More »

పనులు సకాలంలో పూర్తిచేయాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నిజాంసాగర్‌ – నర్సింగ్‌రావుపల్లి రహదారిపై మంజీర వంతెన నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అధికారులను ఆదేశించారు. రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు గత కొంతకాలంగా నిలిచిపోవడంతో ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. అనంతరం కామారెడ్డి ఆర్‌అండ్‌బి ఇఇ అంజయ్యతో ఫోన్‌లో మాట్లాడి సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

Read More »