Breaking News

Daily Archives: December 12, 2017

వైభవంగా ప్రారంభమైన మల్లన్న జాతర ఉత్సవాలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో మంగళవారం నుంచి మల్లన్నజాతర, శ్రీమల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, తదితరులు దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఎడ్లబండ్లను అందంగా ముస్తాబుచేసి ఊరేగించారు. ఉదయం 6 గంటల నుంచి స్వస్తివాచనం, గణపతిపూజ, దీపస్థాపన, కలశ స్థాపన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ...

Read More »

విశ్రాంత ఉద్యోగుల క్రీడలు ప్రారంభించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన క్రీడల పోటీలను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. 17న జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగుల క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాడ్మింటన్‌ ఆడి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు క్రీడల్లో పాల్గొని తమ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ...

Read More »

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర కాలనీలో జరిగిన శ్రీరేణుకమాత కళ్యాణం సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ పుస్తె, మట్టెలను వితరణ చేశారు. మంగళవారం అమ్మవారి కల్యాణ కార్యక్రమం రేణుక మాత ఉపాసకుడు మక్క కృష్ణ ఆద్వర్యంలో వైభవంగా జరిగింది. బంగారం పుస్తె, మట్టెలను కాంగ్రెస్‌ నాయకులు మహ్మద్‌ ఇషాక్‌ షేరూ, రాంకుమార్‌గౌడ్‌లు అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉగ్గుకథ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ...

Read More »

మహిళలపట్ల వివక్షపై పోరాటం

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల పట్ల వివక్ష పెరిగిందని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఏఐఎఫ్‌బిడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌.మీణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మహిళల పట్ల వివక్ష పెరిగిందన్నారు. మహిళల సమస్యలు నిర్భయంగా చెప్పుకొనే పరిస్తితి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లాలో ఎస్‌పి, డిఎస్‌పిలు మహిళలే ఉన్నప్పటికి మహిళా పోలీసు స్టేషన్‌ ఏర్పాటుపట్ల నిర్లక్ష్యం ...

Read More »

హరితహారంపై నివేదిక సమర్పించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో నాటిన మొక్కల్లో ఎన్ని బ్రతికిఉన్నాయి అనే దానిపై ఈనెల 18లోగా నివేదిక సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం హరితహారంపై ఆయన అధికారులతో సమీక్షించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన కోటి 37 లక్షల మొక్కల స్థితిపై సంబంధిత అధికారులు నివేదికతో పాటు జియో ట్యాగింగ్‌ చేపట్టాలన్నారు. వాచ్‌ అండ్‌ వార్డు, వాటరింగ్‌, గ్రిల్‌బ్రిజేడ్‌పై నివేదికను సమర్పించాలన్నారు. నర్సరీల్లో ఉన్న మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ...

Read More »

సాహిత్య రంగంలో సేవలందించిన వారికి సన్మానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్య రంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను మంగళవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సన్మానించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కర్సక్‌ బిఇడి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సాహిత్య రంగంలో ప్రతి ఒక్కరు తమ ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే అన్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే తెలుగు మహాసభలకు ఆసక్తిగల ఉపాధ్యాయులు, ఉద్యోగులు డ్రెస్‌కోడ్‌ పాటించాలని ...

Read More »

మహాసభలకు ఏర్పాట్లు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో జిల్లా నుంచి 15 వాహనాలను ఏర్పాటు చేసి ఆసక్తిగల సాహిత్యకారులు, ఉపాధ్యాయులను తరలించాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌పి. సింగ్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. డిసెంబరు 15 నుంచి 19 వరకు మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనదలచిన వారు నోడల్‌ అధికారి ద్వారా నిర్నీత తేదీల్లో హాజరుకావాలని ...

Read More »

ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంపై రైతులకు అవగాహన

  బీర్కూర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకం కింద మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ప్రస్తుతం బ్యాంకులో పంట రుణం పొందకున్న నేరుగా మీసేవా కేంద్రం నుంచి రైతు సంబంధిత వివరాలు నిర్దేశించిన పత్రంలో సమర్పించి ఆన్‌లైన్‌ చేసి బీమా ప్రీమియం చెల్లించి సమర్పించాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య సూచించారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఇన్సురెన్సు కంపెనీ ఐసిఐసిఐ ల్యామ్‌బోర్డుకు ఇచ్చిందని, ఈ కంపెనీ ్పపొఫార్మాలో రైతు పూర్తి ...

Read More »

అలరించిన కవిసమ్మేళనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 10.30 గంటలకు విద్యార్థులకు ముగ్గులపోటీ నిర్వహించారు. ఆయా పాఠశాలలకు చెందిన 35 మంది విద్యార్థులు చక్కటి రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. బాలభవన్‌ సంగీత ఉపాధ్యాయురాలు ఉమాబాల న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు హైస్కూల్‌ విద్యార్థులకు జనరల్‌ నాలెడ్జ్‌ పోటీలు నిర్వహించగా 20 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు గ్రంథాలయ కార్యదర్శి ఒక ప్రకటనలో ...

Read More »

నెమలి పాఠశాల విద్యార్థులకు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని నెమ్లి పాఠశాల విద్యార్థులకు గ్రూప్‌ డ్యాన్స్‌ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ తెలిపారు. గతనెల కామారెడ్డిలో యువజనోత్సవంలో పాఠశాల నుంచి 38 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నారని, అందులో గ్రూప్‌ డాన్స్‌ విభాగంలో నెమ్లి పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి పొందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. వీరికి 5వ తేదీన రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని ...

Read More »

ఆర్‌టిసి కార్మికుల ధర్నా

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆర్‌టిసిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యం వైఖరికి నిరసనగా టిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ డిపో-1 ముందు భోజన విరామ సమయంలో ఆర్టీసి కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏప్రిల్‌ మాసం నుంచి పే స్కేల్‌ ఆచరణకు నోచుకోలేదని, 62 శాతం ఫిట్‌మెంట్‌ పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలని, 30 ...

Read More »

ఈగ గంగారెడ్డిపై ధ్వజమెత్తిన ప్రజాసంఘాలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భరత్‌రెడ్డి వ్యవహారంలో జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్‌సి కమీషన్‌ సభ్యులు కె.రాములును తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగగంగారెడ్డి విమర్శించడంపై దళిత, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ సావెల్‌ గంగాధర్‌ మాట్లాడారు. అభంగపట్నం గ్రామంలో దళితులైన రాజేశ్వర్‌, లక్ష్మణ్‌లను భరత్‌రెడ్డి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించి హింసించాడని, ఈ ఘటన జరిగి దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఒక్కసారి కూడా నోరుమెదపని ...

Read More »

కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ఇన్‌చార్జి కలెక్టర్‌

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీలో కంటి ఆసుపత్రిని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ సొసైటీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని, అవయవలోపంతో పుట్టిన పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన స్నేహ సొసైటీని ప్రశంసించారు. అన్ని అవయవాల కన్న నయనం ప్రధానమని, వ్యాధులు గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ డైరెక్టర్‌ సిద్ధయ్య, ...

Read More »

ఘనంగా బీరప్ప పండుగ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామంలో బీరప్ప పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా అందంగా అలంకరించిన బోనాలను కుర్మ కులస్తులందరు ఇంటికో బోనం చొప్పున డోలు, నృత్యాలతో వివిధ వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ఊరచెరువులో లింగాలను వెతకడం, గ్రామంలో బీరప్ప కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌, గున్కుల్‌, బూర్గుల్‌ తదితర గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.

Read More »

గ్రామ పంచాయతీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఎంపిడివో కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టిఆర్‌ఎస్‌కెవి సభ్యత్వ నమోదు చేపడుతున్నామని కారోబార్లు, సఫాయి సిబ్బంది, వాటర్‌మెన్లు అందరు సభ్యత్వ నమోదు చేసుకోవాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించాలని, అర్హులైన కారోబార్లను రెగ్యులరైజ్‌ చేస్తు, గ్రేడ్‌-2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని, ...

Read More »

మరుగుదొడ్లు నిర్మించుకోండి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపిడివో రాములు నాయక్‌, ఎపివో సుదర్శన్‌, పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామసభలో వివరించారు. లబ్దిదారులతో మాట్లాడుతూ 12 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని మొదటగా సగం నిర్మించిన తర్వాత రూ. 6 వేలు, నిర్మాణం పూర్తయిన ...

Read More »