Breaking News

Daily Archives: December 13, 2017

లంబాడీల శంఖారావానికి తరలిన విద్యార్థులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించనున్న లంబాడీల శంఖారావానికి కామారెడ్డి జిల్లా నుంచి లంబాడి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆదివాసీల కుట్రలు పనిచేయవని పేర్కొన్నారు. వారిని ఎస్‌టిల్లో చేర్చడం సరికాదని అన్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని నినాదాలు చేశారు. తమ సత్తా చూపిస్తామని నినాదాలు చేస్తు కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బాలునాయక్‌, జబ్బర్‌ నాయక్‌, జీవన్‌ నాయక్‌, లంబాడీ విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

భూ ప్రక్షాళన ద్వారా రైతు భూవివాదాలకు పరిష్కారం

  కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రెవెన్య రికార్డుల ప్రక్షాళన ద్వారా వివాదాస్పద భూములకు సంబంధించి పరిష్కారం లభిస్తుందని, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన గాంధారి మండలంలో రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ నమోదు పరిశీలించారు. అనంతరం రైతులలతో సమావేశమై మాట్లాడారు. త్వరలో రైతుకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుందని, ప్రక్షాళన ద్వారా రైతులు తమ రికార్డులను సరిచేసుకొని తద్వారా ప్రభుత్వ లబ్దిని పొందవచ్చన్నారు. రైతులు తమ …

Read More »

అలరించిన విద్యార్థుల పద్యపఠనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో బుధవారం వివిధ పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు హైస్కూల్‌ విద్యార్థులకు పద్యపఠనం నిర్వహించగా 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మద్యాహ్నం 12 గంటలకు కవితా రచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైస్కూల్‌, ఇతర స్థాయి విద్యార్థులకు తెలంగాణ బతుకమ్మ, బోనాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు 8,9,10 …

Read More »

నేడు రాష్ట్ర పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాక

  కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి గురువారం నేడు రాష్ట్ర పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోనేటి దామోదర్‌ రానున్నట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. ఉదయం 11.30 గంటలకు కామారెడ్డికి చేరుకొని డిపివో భవనాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం సిరిసిల్లాకు, సిద్దిపేటకు వెళతారని తెలిపారు.

Read More »

శాశ్వత అన్నదానానికి రూ.15 వేలు విరాళం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిత్య అన్నదాన సత్రానికి బీర్కూర్‌ గ్రామానికి చెందిన వేమూరి రామకోటేశ్వర్‌రావు రూ. 15 వేలు విరాళంగా అందించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రామకోటేశ్వర్‌రావును శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గురుస్వాములు బెజుగం శంకర్‌, వినయ్‌కుమార్‌, విఠల్‌ రెడ్డి, వీరప్ప, భాస్కర్‌, సాయిరెడ్డి, నర్సన్నచారి, అయ్యప్పస్వాములు ఉన్నారు.

Read More »

అంబులెన్సులో ప్రసవం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన బుద్దెశోభకు పురిటినొప్పులు రావడంతో బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో అంబులెన్సుకి సమాచారం అందించారు. అంబులెన్సులో మీర్జాపూర్‌ నుంచి బాన్సువాడ తీసుకెళుతుండగా బాన్సువాడ సమీపంలో అంబులెన్సులో ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇఎంటి రవికుమార్‌, పైలట్‌ సతీష్‌ తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి చికిత్సనిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

Read More »

తాళం వేసిన ఇంట్లో చోరీ

  గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తాళం వేసిన ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి ఇంట్లో బీభత్సం సృష్టించారు. గాంధారిలోని బాల్‌రాజ్‌గారి మైసవ్వ, బాల్‌రాజ్‌గారి విఠల్‌ ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మైసవ్వ ఇంట్లో 4 తులాల బంగారం, 30 తులాల వెండి, విఠల్‌ ఇంట్లో 40 తులాల వెండి అపహరణకు గురయ్యాయన్నారు. రెండునెలల క్రితం వారింట్లో ఒకరు చనిపోగా ఇళ్లు వదిలిపెట్టాలని వాస్తు దోషం ఉండగా వారు …

Read More »

58 వేల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అచ్చంపేట సహకార సంఘం పరిధిలోని మండలంలోని ఆయా గ్రామాల్లో 8 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 58 వేల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేశామని అచ్చంపేట సహకార సంఘం సిఇవో సంగమేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. సహకార సంఘ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 1520 మంది రైతుల నుంచి 9.23 కోట్ల విలువగల ధాన్యం కొనుగోలు చేసి, ఇప్పటివరకు 1100 మంది రైతులకు 7.10 కోట్ల రూపాయలను …

Read More »

నేడు గ్రంథాలయంలో రంగోళి పోటీలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం మహిళలకు మెహందీ, రంగోళి పోటీలు నిర్వహించనున్నట్టు గ్రంథాలయ కార్యదర్శి సురేశ్‌బాబు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు విద్యార్థినిలకు, పాఠకులకు, మహిళలకు మెహందీ, రంగోళి పోటీలు నిర్వహిస్తామన్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల స్త్రీ, శిశుసంక్షేమ శాఖ కార్యనిర్వాహకురాలు నవనీతరావుతో పాటు కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ హాజరుకానున్నట్టు తెలిపారు. వీరితోపాటు గ్రంథాలయ ఛైర్మన్‌ సంపత్‌గౌడ్‌, …

Read More »

జనవరిలో కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తాం

  గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు జనవరిలో కొత్త పట్టాపాస్‌ పుస్తకాలు అందజేస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలో కొనసాగుతున్న రెవెన్యూ రికార్డుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న రైతులతో మాట్లాడారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం ప్రక్షాళన కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు జిల్లాలో 90 శాతం సర్వే పూర్తి అయిందన్నారు. …

Read More »