Breaking News

భూ ప్రక్షాళన ద్వారా రైతు భూవివాదాలకు పరిష్కారం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రెవెన్య రికార్డుల ప్రక్షాళన ద్వారా వివాదాస్పద భూములకు సంబంధించి పరిష్కారం లభిస్తుందని, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన గాంధారి మండలంలో రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ నమోదు పరిశీలించారు. అనంతరం రైతులలతో సమావేశమై మాట్లాడారు. త్వరలో రైతుకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుందని, ప్రక్షాళన ద్వారా రైతులు తమ రికార్డులను సరిచేసుకొని తద్వారా ప్రభుత్వ లబ్దిని పొందవచ్చన్నారు. రైతులు తమ పహాణీలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. జనవరిలో వివాదాస్పద భూముల పరిష్కారం చేపడతామని పేర్కొన్నారు. గాంధారి మండలంలోని 33 గ్రామాల్లో 86 శాతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తయినట్టు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, పట్వారి హుస్సేన్‌, రైతులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *