Breaking News

అలరించిన విద్యార్థుల పద్యపఠనం

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో బుధవారం వివిధ పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు హైస్కూల్‌ విద్యార్థులకు పద్యపఠనం నిర్వహించగా 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మద్యాహ్నం 12 గంటలకు కవితా రచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైస్కూల్‌, ఇతర స్థాయి విద్యార్థులకు తెలంగాణ బతుకమ్మ, బోనాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు 8,9,10 తరగతుల విద్యార్థులకు క్యారమ్స్‌ పోటీ నిర్వహించినట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తెలిపారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *