Breaking News

Daily Archives: December 14, 2017

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య యత్నం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని మాధవనగర్‌ బైపాస్‌ ప్రాంతంలోగల శ్రీమేధ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న రుచిత అనే విద్యార్థిని హాస్టల్‌ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. రుచితకు తీవ్ర గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రుచిత అక్కడ చికిత్స పొందుతుంది.

Read More »

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోంగార్డుల వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంగార్డులు కెసిఆర్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో భాగంగానే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు, హోంగార్డుల వేతనాలు, ఆయాలు, అంగన్‌వాడి టీచర్ల వేతనాలు తదితర సమస్యలను ...

Read More »

టేకులపల్లిది బూటకపు ఎన్‌కౌంటర్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులను పొట్టల పెట్టుకున్నది బూటకపు ఎన్‌కౌంటర్లు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సిపిఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. మావోయిస్టు ఎజెండాయే తమ ఎజెండా అని కెసిఆర్‌ ఎన్నికల ముందు అన్నారని, మరి అది ఇప్పుడు ఎటు పోయిందన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం సిగ్గుచేటన్నారు. మోడి, ...

Read More »

డైరీలో ఎన్‌ఎస్‌యుఐ సభ్యత్వ నమోదు

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో గురువారం సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి మధుయాదవ్‌, నగేశ్‌ కడియప్ప, మోహన్‌, ఐరేని సందీప్‌లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై వివిధ దఫాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యుఐ అన్నారు. డైరీ కళాశాల ఏర్పాటు కోసం సైతం పూర్వ ఎన్‌ఎస్‌యుఐ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. విద్యార్థులు ఎన్‌ఎస్‌యుఐ సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని ...

Read More »

జనవరి నుంచి వివాదాస్పద భూముల పరిష్కారం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళనలో భాగంగా జనవరి నుంచి వివాదాస్పద భూముల వివరాలు పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన భూప్రక్షాళనలో భాగంగా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ప్రక్షాళన కార్యక్రమానికి హాజరై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 473 రెవెన్యూగ్రామాలకు గాను 430 గ్రామాల్లో ఆన్‌లైన్‌ అప్‌డేషన్‌, 1 బిలను స్వీకరించినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మూడునెలల వ్యవధిలో తహసీల్దార్లు, టీం మెంబర్లు ...

Read More »

470 గ్రామాల్లో భూప్రక్షాళన

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇప్పటివరకు 470 గ్రామాల్లో భూ ప్రక్షాళన జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన జనహిత భవనంలో రబీ పంటలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ ఏరువాక కేంద్రం సౌజన్యంతో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లోని సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, అభ్యుదయ రైతులతో సమావేశం నిర్వహించారు. రబీలో సాగుచేసే వరి, మొక్కజొన్న, శనగ పంటల గురించి వివరించారు. ...

Read More »

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోటగిరి, బోధన్‌ గ్రామీణ మండలాల్లో నిజాంసాగర్‌ కాలువలను పరిశీలించారు. స్వయంగా జీపు నడుపుతూ కాలువలపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి యాసంగికి నీటి విడుదల చేసిన నేపథ్యంలో అన్ని డిస్టిబ్యూటరీ కాలువల్లో ప్రవాహం తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్టు తెలిపారు. రైతులను వివరాలు ...

Read More »

మినీగల్ప్‌గా నందిపేట మండలం

  నందిపేట, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో మండలంలోని ప్రజలు బతుకుదెరువు కోసం గల్ప్‌ దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి పంపితే ఇక్కడి కుటుంబీకులు పోషణ చేసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారి మండలం దినదినాభివృద్ధి చెందుతుండడంతో గల్ప్‌బాట తగ్గడంతోపాటు ఇక్కడి ప్రాంతానికే దేశంలోని వివిద ప్రాంతాల ప్రజలు బతుకుదెరువు కోసం నందిపేట మండలానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా లక్కంపల్లిలోని మెగా ఫుడ్‌పార్కు పనులు నడుస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒరిస్సా, పంజాబ్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రికి కాంపౌండ్‌ నిర్మిస్తాం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తామని డిప్యూటి డిఎంఅండ్‌ హెచ్‌వో రవిందర్‌గౌడ్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలలో భాగంగా ఈ సంవత్సరం టాయిలెట్లు, ప్లంబింగ్‌ పనులు, ఫ్రీజ్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి చుట్టు కాంపౌండ్‌ వాల్‌నిర్మించి సామాన్యులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య, ...

Read More »

దుకాణదారులు సిసి కెమెరాలు అమర్చుకోవాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుకాణదారులు తమ దుకాణాల వద్ద సిసి కెమెరాలు అమర్చుకోవాలని బీర్కూర్‌ ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌ గ్రామ దుకాణ యజమానులతో గురువారం సిసి కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాలు ఉండడం వల్ల అపరిచిత వ్యక్తులను గుర్తించవచ్చని అన్నారు. గ్రామంలో దొంగతనాలు అరికట్టవచ్చన్నారు. ఇందుకోసం గ్రామంలోని దుకాణదారులు తప్పకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

  నందిపేట, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ముగ్గురిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. వారి వద్దనుంచి 3 వేల 30 రూపాయలు, పేకముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్టు తెలిస్తే 9440795436కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

Read More »

తెరాసలో చేరిన మైనార్టీ నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు గురువారం స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. వీరిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెర్కిట్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సమద్‌, కరీం, మున్నుబాయ్‌, ముక్రమ్‌, ఖలీల్‌, ముక్తార్‌ హైమద్‌ తదితరులు ఉన్నారు.

Read More »

24న గోదావరి నదీతీరంలో వేద వైజయంతి ఉత్సవాలు

  బాసర, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలరోజులుగా బాసర గోదావరి నదీ తీరంలో వేదభారతి పీఠం ఆద్వర్యంలో గంగాహారతి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబరు 24న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేద వైజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వేదపారాయణం, హోమం, పూజా, వేద గంగాహారతి రిషి కన్నెలచే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Read More »

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పకుండా ధరించాలి

  – ట్రాఫిక్‌ సిఐ నాగేశ్వర్‌ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని నిజామాబాద్‌ ట్రాఫిక్‌ సిఐ నాగేశ్వర్‌ తెలిపారు. నగరంలో పలుచోట్ల ఆయన గురువారం తమ సిబ్బందితో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిరస్త్రానం ధరించడం వల్ల ప్రమాదాలు గురైనపుడు తలకు గాయాలు కాకుండా రక్షణగా ఉంటుందని, ప్రతి వాహనదారుడు తప్పకుండా తమ వెంబడి వాహనానికి సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ...

Read More »

డాక్టర్‌ వెంకన్నగారి జ్యోతికి పద్య చూడామణి పురస్కారం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ కవయిత్రి డాక్టర్‌ వెంకన్నగారి జ్యోతికి పద్య చూడామణి బిరుదు ప్రదానం చేశారు. నగరంలో గురువారం శివాజీనగర్‌లో గల రామకృష్ణ విద్యాలయంలో మాతృభాషోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతికి బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గాయత్రీ ధార్మిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ తరిగిపోతున్న తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి ...

Read More »

ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అధికారుల నూతన కార్యవర్గం ఎన్నిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అధికారుల నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మధుబాబు (ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌ విభాగం), ఉపాధ్యక్షులుగా శ్యాంసుందర్‌ (ఎస్‌హెచ్‌వో భీమ్‌గల్‌), ప్రధాన కార్యదర్శిగా సాయన్న (టాస్క్‌ఫోర్సు కామారెడ్డి), కోశాధికారిగా కమలాకర్‌రెడ్డి (ఎస్‌హెచ్‌వో నిజామాబాద్‌), ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా రఘునాథ్‌రెడ్డి (ఎస్‌హెచ్‌వో ఆర్మూర్‌), సంయుక్త కార్యదర్శిగా ఏఎల్‌ఎన్‌.స్వామి (ఎస్‌హెచ్‌వో ఎల్లారెడ్డి), కార్యవర్గ సభ్యులుగా శేఖర్‌ (ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌), దీపిక (ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం నిజామాబాద్‌), సంతోష్‌రెడ్డి (ఎస్‌హెచ్‌వో బాన్సువాడ) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ...

Read More »

కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి?

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం దాదాపు ఖాయమైనట్టు అతని సన్నిహితులు అంటున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, భూపతిరెడ్డిల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ వివాదం ముదరడంపై బాజిరెడ్డి కుమారుడు జగన్‌, భూపతిరెడ్డిని ఫోన్లో బెదిరించడం, ఈ విషయంపై భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ జోక్యం ...

Read More »

నిజాంసాగర్‌ కాలువను పరిశీలించిన మంత్రి పోచారం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌, కోటగిరి మండలాల్లో నిజాంసాగర్‌ కాలువను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం పరిశీలించారు. యాసంగి పంట కోసం నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా నీటి ప్రవాహం తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి పంటకు రైతులకు ఎలాంటి నీటి ఎద్దడి ఉండకూడదని, ప్రతి ఎకరాకు నీరందేలా, చివరి ఆయకట్టు వరకు నీరు అందేట్లు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరీ వద్ద నీరు ...

Read More »

వృద్ధాశ్రమాలు మన సంస్కృతి కాదు

  – జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధాశ్రమాలు మన సంస్కృతి కాదని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోగల న్యూ అంబేడ్కర్‌ భవనంలో వయోవృద్దులు, తల్లిదండ్రుల నిర్వహణ చట్టం- 2011 అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈరోజుల్లో వృద్దులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తు వారిని అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనంలో మనకోసం రాత్రింబవళ్లు కష్టపడి ఉన్నత చదువులు చదివించిన ...

Read More »