Breaking News

Daily Archives: December 15, 2017

కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాల్‌సెంటర్‌ ఉద్యోగాల కొరకు మెప్మా, ఎడుబ్రిడ్జ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్తంగా నిరుద్యోగ యువత కొరకు ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలంగాణ మేనేజర్‌ సుమన్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ సంస్థ ఎంతోమంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిందని, కాల్‌సెంటర్‌ శిక్షణతోపాటు రిటైల్‌ ఇండస్ట్రీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులకు శిక్షణతోపాటు స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ ...

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బిగాల

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త శుక్రవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో అర్సపల్లిలోగల మహేశ్వరి పైప్‌ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. నాగారం డంపింగ్‌ యార్డు వద్ద రోడ్డు పనులకుశంకుస్థాపన చేశారు. అనంతరం నాగారంలో ఒడ్డెర సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ అభివృద్దిలో రాజీపడే ప్రసక్తే లేదని, నగరంలో అన్ని డివిజన్‌లలో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ...

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలకు తరలిన ఉపాధ్యాయులు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల నుంచి తెలుగు భాషోపాధ్యాయులు, పండితులు శుక్రవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎల్‌బిస్టేడియంలో జరిగే ప్రారంభకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌ రావు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ప్రపంచ దేశాల నుంచి తెలుగు ...

Read More »

దీపం పథకం ద్వారా సిలిండర్ల పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, సిలిండర్ల ఉపయోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 54 మంది డ్వాక్రా గ్రూప్‌ మహిళలకు సిలిండర్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌ ప్రసాద్‌ మహిళలకు సిలిండర్‌పై వంట చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, సర్పంచ్‌ సాయిరాం, ఎంపిటిసి మహేందర్‌లు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా మధుయాష్కీ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ జన్మదినాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టిపిసిసి కార్యదర్శి నరాల రత్నాకర్‌ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి కేక్‌కట్‌చేసి వేడుకలు ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిమిత్తం ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు. స్నేహ సొసైటీలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ప్రభుత్వ ...

Read More »

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తలసాని

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో మత్స్యకారుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. దీనికి గాను మంత్రి రూ.10 లక్షల నిధులు మంజూరుచేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని ధర్మోరా, మామిడిపల్లి, మాక్లూర్‌, బొంకన్‌పల్లి, అమ్రాద్‌, చిక్లి, కల్లెడ, డొంకేశ్వర్‌, తల్వేద, ఉమ్మెడ, నందిపేట, ఫతేపూర్‌, మంతని, పెర్కిట్‌, పిప్రి, ...

Read More »

రేషన్‌ బియ్యం తూకంలో గోల్‌మాల్‌

  నందిపేట, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారుల అలసత్వంతో పిడిఎస్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం గుత్తేదారుల ద్వారా ప్రతినెల చౌకధరల దుకాణాలకు బియ్యం, ఇతర సరుకులను సరఫరా చేస్తుంది. ఖాళీ బస్తా బరువు మినహాయించి ప్రతి బస్తాలో 50 కిలోల బియ్యం నింపి గ్రామాల్లోని రేషన్‌ డీలర్లకు పంపుతుంది. ఇలా వచ్చిన సరుకు రేషన్‌ డీలర్లు కార్డుల యజమానులకు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున తూకం చేసి ఇవ్వాల్సి ...

Read More »

పేకాట రాయుళ్ళ అరెస్టు

  నందిపేట, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని బజార్‌కొత్తూరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ అక్కడికి చేరుకొని పేకాట ఆడుతున్నవారిని పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి 1840 రూపాయలు, పేకముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.   అదేవిధంగా గురువారం సాయంత్రం ఐలమ్మ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన చాకలి దాసు అనే వ్యక్తి మద్యం సేవించి ...

Read More »

జెండా బాలాజీ ఆలయంలో కళశ పూజ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయాన్ని శుద్ధిచేసి 108 కళశాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం వేదమంత్రాలతో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ గోవింద్‌రాజు, ఇవో రవిందర్‌, ఆలయ అర్చకులు నాగరాజుచారి, అరవింద్‌ సిద్ధాంతి, విష్ణుసహస్రనామ పారాయణ భక్తబృందం సభ్యులు పాల్గొన్నారు.

Read More »

నిజాంసాగర్‌ కాలువలో ఆటోడ్రైవర్‌ గల్లంతు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్టిబ్యూటరీ 7 సమీపంలో మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న ఆటోడ్రైవర్‌ ఆల్మస్‌ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం… రాజు, రాకేశ్‌, ఆల్మాస్‌లు కలిసి ప్రధాన కాలువ వద్దకు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి నీటిని తీసుకునే ప్రయత్నంలో కాలుజారి నీటిలోకి జారుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యాడని తెలుస్తుంది. నీటిలో మునిగిన ఆల్మస్‌ను రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం ...

Read More »

మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బంజేపల్లి గ్రామంలో నూతనంగా మురికి కాలువ నిర్మాణ పనులను బంజేపల్లి సర్పంచ్‌ బేగరి రాజు శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల ద్వారా 65 మీటర్ల పొడవు మురికి కాలువల నిర్మాణం, 40 మీటర్ల పొడవు సిసి రోడ్డు నిర్మిస్తున్నామని సర్పంచ్‌ తెలిపారు. మురికి కాలువల నిర్మాణంతో కాలనీలో ఇబ్బందులు దూరమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు దుర్గాగౌడ్‌, లింగాగౌడ్‌, భిక్యా తదితరులున్నారు.

Read More »

కల్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని మాగి సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, నీటివినియోగదారుల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి అన్నారు. ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణలక్ష్మికి సంబంధించిన లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మట్లాడుతూ గ్రామాల్లోని నిరుపేద కుటుంబాల ఆడపిల్లల వివాహం చేయలేని పరిస్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకోసం తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాలు అమలు చేసిందని తెలిపారు. మండలంలోని 22 మంది లబ్దిదారులకు మంజూరైన చెక్కులను ...

Read More »

మహ్మద్‌నగర్‌లో భూసార పరీక్షలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహ్మద్‌నగర్‌ గ్రామంలో మినీ భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయాధికారులు రవిందర్‌, రేణుక భూములకు సంబంధించిన మట్టిని సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. యాసంగి సీజన్‌కు గాను మట్టి పరీక్షలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. మండలంలోని గున్కుల్‌, మగ్దుమ్‌పూర్‌, ఒడ్డేపల్లి, నిజాంసాగర్‌ క్లస్టర్‌లో భూ మట్టి నమూనా పరీక్షలు చేస్తున్నట్టు అన్నారు. అనంతరం రైతులకు కావాల్సిన ఎరువుల వాడకంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read More »