Breaking News

Daily Archives: December 19, 2017

వసతి గృహ విద్యార్థుల జిల్లాస్థాయి పోటీలకు బీర్కూర్‌ విద్యార్థులు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21,22 తేదీల్లో కామారెడ్డి జూనియర్‌ కళాశాల నిర్వహించే బిసి వసతి గృహ జిల్లా స్థాయి పోటీల్లో బీర్కూర్‌ వసతి గృహ విద్యార్థులు ఎంపికయ్యారని వార్డెన్‌ రాములు తెలిపారు. కబడ్డి, వాలీబాల్‌, క్యారమ్‌ పోటీలకు 15 మంది విద్యార్థులు ఎంపికైనట్టు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్తాయికి ఎంపిక చేస్తారని అన్నారు.

Read More »

వ్యక్తి అదృశ్యం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం అర్సపల్లికి చెందిన రాజేశ్వర్‌ (60) అనే వ్యక్తి అదృశ్యమైనట్టు 6వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు రాజేశ్వర్‌ ఈనెల 15వ తేదీ నుంచి ఇంట్లోంచి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని అన్నారు. అతని కుటుంబీకులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయిందని రాజేశ్వర్‌ కుమారుడు రాజు మంగళవారం తమకు పిర్యాదుచేసినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

అంగన్‌వాడి టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఐదు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడి టీచర్లు, ఆయా ల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ అధికారిణి రాధమ్మ తెలిపారు. అంగన్‌వాడి టీచర్లు – 11, మినీ అంగన్‌వాడి టీచర్లు, ఆయాలు – 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం ష్ట్ర్‌్‌జూ://షసషష.్‌స్త్ర.అఱష.ఱఅ వెబ్‌సైట్లో సంప్రదించాలని కోరారు. దరఖాస్తులతో ...

Read More »

21న వికలాంగులకు బస్సుపాసులు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21న మండల మహిళా సమాఖ్య నసురుల్లాబాద్‌ కార్యాలయంలో వికలాంగులకు బస్సుపాసు అందజేయడం జరుగుతుందని ఏపిఎం సత్యనారాయణ తెలిపారు. ఇందుకుగాను సదరం సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు జిరాక్సు, 2 పాస్‌ పోర్టు సైజు ఫోటోలతో నసురుల్లాబాద్‌ మండల సమాఖ్య కార్యాలయానికి అర్హత కలిగిన వికలాంగులు హాజరుకావాలని కోరారు.

Read More »

పేదప్రజలకు అన్నదానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డు వడ్డెర కాలనీలో అయ్యప్పస్వాములు పేదలకు మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పస్వాములతో పాటు పలువురు చారిటీగా ఏర్పడి పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఈక్రమంలో నిరుపేదలకు అన్నదానం చేసినట్టు కాంగ్రెస్‌ నాయకుడు రాంకుమార్‌గౌడ్‌ తెలిపారు.

Read More »

ఫీజు బకాయిల విడుదల కోసం కదంతొక్కిన విద్యార్థులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తు మంగళవారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆజాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కెజి నుంచి పిజి ఉచిత విద్య అని మాటలు చెబుతూ చేతల్లోకొచ్చేసరికి కనీసం విద్యార్థులకు సంబంధించిన పీజు బకాయిలు, స్కాలర్‌సిప్‌లు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. వీటివల్ల పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ...

Read More »

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

    కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఏఐఎస్‌ఎప్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేణు అన్నారు. మంగళవారం కామారెడ్డిలో జిల్లా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని, ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యావ్యవస్థను పెంచిపోషిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో విద్యాపరంగా వెనకబడి ఉందని, జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఐటిఐ, ...

Read More »

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జనహిత భవనంలో మంగళవారం పోలీసు, రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వాటిపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి విఘాతం జరిగినా వాటిని కాపాడాలన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా ...

Read More »

నూతన జిల్లాల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన జిల్లాలుగా ఏర్పడ్డ సంగారెడ్డి, కామారెడ్డిల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జహీరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బి.బి.పాటిల్‌ అన్నారు. మంగళవారం పార్లమెంటు సమావేశంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో నిమ్స్‌జ్‌ ఏర్పాటు కావడం వల్ల ఇక్కడ సుమారు 8 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ రంగంతోపాటు టెక్స్‌టైల్స్‌, చెరుకు, బెల్లం, ఆహారధాన్యాల ఉత్పత్తి రంగంలో మార్కెట్‌ యార్డుగా పేరుపొందిందని, కామారెడ్డి, సంగారెడ్డిల్లో ...

Read More »

సెల్‌ టవరెక్కిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ఎంఆర్‌పిఎస్‌ నాయకులు మంగళవారం సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోగల బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. దాదాపు గంటన్నరపాటు ఉత్కంఠ పరిస్తితి నెలకొంది. జిల్లా నాయకులు జి.నాగభూషణం, విద్యార్థి విభాగం నాయకుడు సంతోష్‌ సెల్‌ టవర్‌ ఎక్కి మందకృష్ణ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు కనిపించడంతో ఆప్రాంత వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ...

Read More »

21న ఆరెకటిక వివాహ పరిచయవేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21న తెలంగాణ పదిజిల్లాలకు సంబందించి ఆరెకటిక వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌ ఆరెకటిక సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌ తెలిపారు. మంగళవారం సంఘ భవనంలో విలేకరులతో మాట్లాడారు. తాము చేపట్టబోయే పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆరెకటిక బంధవులు సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అధ్యక్షుడు గోలికర్‌ నర్సింగ్‌రావు హాజరవుతున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సుభాష్‌, కోశాధికారి దత్తు, జిల్లా అధ్యక్షుడు సయ్యాజీ తదితరులు ...

Read More »

సుభాష్‌నగర్‌ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధనుర్మాసాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోగల సుభాష్‌నగర్‌ రామాలయంలో మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 29న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారదర్శనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా జనవరి 14న తిరుప్పావై, గ్రంథపూజ, శ్రీగోదా రంగనాయక కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విఠల్‌రెడ్డి, కోశాధికారి సాయిలు, ...

Read More »

భవిష్యత్తు తరాలకు తెలుగుభాషనందించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు భాషను కాపాడుకొని భవిష్యత్తు తరాలకు తెలుగు భాషనందించాలని ఇందుకు అందరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో సభలకు వెళ్తున్న బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు మహాసభల్లో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్తాయికి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రతిరోజు తెలుగు భాషను ...

Read More »

ఆసుపత్రి పారిశుద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల బోధన ఆసుపత్రి, ఆర్మూర్‌, బోధన్‌ ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సుధాకర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, జీత భత్యాల విషయంలో కూడా వివక్ష ఎదుర్కొంటున్నారని, వీరికి ...

Read More »