Breaking News

Daily Archives: December 20, 2017

కామారెడ్డిలో మహాసభల విజయోత్సవ సంబరాలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా పూర్తిచేసుకోవడం పట్ల కామారెడ్డిలో కవులు, రచయితలు, కళాకారులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను కలిసి ఆయనకు అభినందనలు తెలుపుతూ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భాష, సంస్కృతులు, సాహిత్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంకల్పబలంతో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమయ్యాయన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో నడిపించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలుగు భాషోపాధ్యాయులు, ...

Read More »

కాలభైరవున్ని దర్శించుకున్న అగ్రికల్చర్‌ ఛైర్మన్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీకాళభైరవస్వామి వారిని రాష్ట్ర అగ్రికల్చర్‌, సెమికల్చర్‌ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి, పిడి సునందలు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. గ్రామ సర్పంచ్‌, ఆలయ కమిటీ ప్రతినిధులు సన్మానించారు.

Read More »

డిసెంబరు చివరి నాటికి భూ ప్రక్షాళన పూర్తిచేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు చివరి నాటికి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. స్థానిక ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో బుధవారం వ్యవసాయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయాధికారులు సమన్వయంగా ప్రణాళిక, నిజాయితీతో కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. మాన్యువల్‌ పహాణీ, 1బిలను రూపొందించాలని, 473 రెవెన్యూ గ్రామాల్లోని 8 లక్షల 534 సర్వేనెంబర్‌లను అందులో పొందుపరచాలన్నారు. అసైన్డ్‌, వక్ప్‌, పివోటి తదితర వివరాలను పూర్తిస్థాయిలో నమోదుచేయాలని ఆదేశించారు. పూర్తిచేసిన ...

Read More »

అందరి భాగస్వామ్యంతోనే స్వచ్చ గ్రామాలు సాధ్యం

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో, పట్టణాల్లో అందరి సహకారంతోనే స్వచ్చగ్రామాలు సాధ్యపడుతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో స్వచ్చత దినోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మొదట ర్యాలీని ప్రారంభించారు. అనంతరం స్వచ్చత కార్యక్రమంపై కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనకు మనమే స్వచ్చత పాటించాలని, తద్వారా రోగాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. పౌష్టికాహారం ...

Read More »

ఖాళీగా ఉన్న కొలువులను భర్తీచేయడంలో ప్రభుత్వం విఫలం

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల కొలువులను భర్తీచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్‌ అన్నారు. బుధవారం కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్షకొలువులను భర్తీచేస్తామని చెప్పి కేవలం 14 వేల కొలువలను భర్తీచేయడం గర్హనీయమన్నారు. పోలీసు ఉద్యోగాలను మాత్రమే భర్తీచేసుకొని తమ దొర రాజ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా నోటిఫికేషన్‌ వేసి మళ్లీ వాటిని వెనక్కి తీసుకోవడం బాధాకరమన్నారు. ఉద్యోగాల భర్తీకోసం నిరుద్యోగుల్లో ...

Read More »

రైతు ఆత్మహత్య

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ గ్రామానికి చెందిన అరిగె తిరుపతి (28) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయం కలిసిరాకపోవడం, అప్పుల బాధతో మానసిక వేదనకు గురై మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు.

Read More »

సకాలంలో డిడిలు కట్టాలి

  గాంధారి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డీలర్లు సకాలంలో డిడిలు కట్టాలని గాంధారి తహసీల్దార్‌ లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మండల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల డీలర్లు సకాలంలో సరుకులకు సంబంధించిన డిడిలను బ్యాంకులలో కట్టాలన్నారు. అదేవిధంగా రేషన్‌ సరుకులను లబ్దిదారులకు ఈ మిషన్ల ద్వారా అందజేయాలని సూచించారు. ప్రతి డీలర్‌ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్సుమెంట్‌ డిటి మునీరుద్దీన్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌రావు, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Read More »

సిసి బెడ్‌ పనులు ప్రారంభం

  గాంధారి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఆవరణలో సిసి బెడ్‌ పనులను సర్పంచ్‌ సత్యం బుధవారం ప్రారంభించారు. పంచాయతీ నిధులతో సిసి బెడ్‌ పనులు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ ముందు ఆవరణ వర్షాలు పడినపుడు బుదరమయం అవుతుందని, దీంతో పంచాయతీకి వచ్చే వారికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. అలా ఇబ్బంది కలగకుండా ఉండటానికి సిసి బెడ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇవో ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సోమారం తాండాలో స్వచ్చత ర్యాలీ

  గాంధారి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం సోమారం తాండాలో విద్యార్థులు బుధవారం స్వచ్చత ర్యాలీ నిర్వహించారు. స్వచ్చతా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు తాండాలో ర్యాలీ నిర్వహించి స్వచ్చతపై ప్లకార్డులను ప్రదర్శించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై తండావాసులకు అర్థమయ్యే విధంగా నినాదాలు చేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రమోద్‌రెడ్డి, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More »

కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయానికి అనుసంధానంగా ఉన్న హెర్తులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం నుంచి ప్రధాన కాలువలోకి నీటి విడుదల కొనసాగుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు 1405 అడుగులకు గాను 1403.82 అడుగుల నీటితో జలాశయం కళకళలాడుతుంది. ప్రాజెక్టు నుంచి ఈనెల 7వ తేదీ నుంచి ప్రధాన కాలువ వెంట యాసంగి పంటల సాగుకోసం నీటి విడుదల కొనసాగుతుంది. ప్రధాన కాలువ వెంట 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని డిప్యూటి డిఇ దత్తాత్రి తెలిపారు. ...

Read More »