Breaking News

Daily Archives: December 21, 2017

గ్రామ పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పేతుసంగం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు విధిస్తు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ పంచాయతీ నిదులు రూ. 7 లక్షల 44 వేల 312 దుర్వినియోగం చేశారని, జిల్లా పంచాయతీ అధికారి విచారణలో సరైన రికార్డులు చూపించనందున రూల్‌ 8 (1) టిఎస్‌పిఎస్‌ (సిసిఅండ్‌ఎ) రూల్స్‌ 1991 ప్రకారం సెక్రెటరీని విదుల నుంచి సస్పెండ్‌ చేస్తు ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. రాజ్‌కుమార్‌ ...

Read More »

ఘనంగా ఆరెకటిక వివాహ పరిచయ వేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఆరెకటిక భవనంలో గురువారం ఆరెకటిక వధూవరుల పరిచయ వేదిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్య్ష, కార్యదర్శులు ప్రకాశ్‌, సుభాష్‌లు మాట్లాడుతూ తాము పిలిచిన వెంటనే తమ విన్నపాన్ని మన్నించి రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావు రావడం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా రాష్ట్ర ఎంబిసి సంఘం ఉపాధ్యక్షుడు శంకర్‌ హాజరై తమ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పరిచయ వేదిక ద్వారా 200 లకు ...

Read More »

23న పౌరహక్కులు, బాధ్యతలపై అవగాహన ర్యాలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి కలెక్టరేట్‌ నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. వినియోగదారులకు వాణిజ్యపరంగా పొందే వస్తువులపై పూర్తి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అన్నిశాఖలు, వాణిజ్య సముదాయాలను వారోత్సవాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యాశాఖ ద్వారా విద్యార్థులు ...

Read More »

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ముందుండాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ముందుండి క్రీడల్లో రాణించాలని కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. గురువారం బిసి సంక్షేమ ప్రీ మెట్రిక్‌ వసతి గృహ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు ఆటలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని, వసతి గృహ విద్యార్థుల క్రీడాపోటీల ద్వారా విద్యార్థుల్లో సోదర భావం ఏర్పడుతుందన్నారు. రెండ్రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కబడ్డి, వాలీబాల్‌, రన్నింగ్‌, చదరంగం, టెన్నికాయిడ్‌, తదితర పోటీల్లో ...

Read More »

కంపుకొడుతున్న బర్కత్‌పుర

  నందిపేట, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామ పంచాయతీలోని బర్కత్‌పుర కాలనీలో మురికి కాలువలు రోడ్లపై నిలిచి కంపుకొడుతుంది. మురికి కాలువలు సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల మురికి నీరురోడ్లపైకి వచ్చి చెత్తతో కలిసి రోజులతరబడి నిలువ ఉండడంతో కాలనీ కంపుకొడుతుంది. బర్కత్‌పురలోని తహారి హోటల్‌ పక్కనుండి దయానంద్‌ రైస్‌మిల్లు వైపు వెళ్ళే రోడ్డుకు నెలరోజుల క్రితం సుమారు 30 మీటర్ల పొడవున మురికి కాలువ నిర్మించారు. కాలువనీరు పక్కనున్న ఎయిర్‌టెల్‌ టవర్‌వద్దకొచ్చి రోడ్డుపై వదిలేస్తున్నారు. సిసి ...

Read More »

వరుణ్‌ మోటార్సు వారి లోన్‌, కారుమేళ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల హరిత ఇన్‌ హోటల్‌ ప్రాంగణంలో వరుణ్‌ మోటార్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆద్వర్యంలో కార్‌, లోన్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌ మోటార్‌ సిఇవో వెంకటరమణ గుప్త మాట్లాడుతూ కార్‌, లోన్‌ మేళ ఎస్‌బిఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వినియోగదారులకు తక్షణ రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, అదేవిధంగా ఎక్చేంజ్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. మేళ 22న శుక్రవారం కూడా కొనసాగుతుందని ఉదయం ...

Read More »

భూ ప్రక్షాళనను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న మాన్యువల్‌పహాణీ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండల కేంద్రంలోని గ్రామ చావిడిలో జరుగుతున్న కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రభుత్వం జారీచేసిన సర్కులర్‌ ప్రకారం నిర్ణీత నమూనాల్లో రికార్డులు నిర్వహించాలని 1బి అనెక్సర్‌, 8 ఫారంల పనులను వేగవంతం చేయాలన్నారు. ఆన్‌లైన్‌ నమోదు కార్యక్రమం సైతం ...

Read More »

పాఠశాలకు ఆర్థికసాయం, కుర్చీల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పివిపి ఓరియంటల్‌ ఉన్నత పాఠశాలకు పాఠశాల పూర్వ విద్యార్థి మహేశ్‌ గుప్త గురువారం ఆర్థిక సాయంతోపాటు పది కుర్చీలు అందజేశారు. గురువారం జరిగిన సమావేశంలో ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడంతోపాటు కుర్చీలను ఇచ్చారు. త్వరలో ప్రొజెక్టర్‌ అందజేస్తామని తెలిపారు. సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్‌ భద్రయ్య మాట్లాడుతూ పిల్లల్లో దాతృత్వ గుణాన్ని పెంపొందించాలని సూచించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాలకు పలు సందర్భాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించడం ...

Read More »

ఆల్పజోలమ్‌ స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు ఉత్పత్తికి ఉపయోగించే 500 గ్రాముల డైజోఫామ్‌, 950 గ్రాముల ఆల్ఫజోలమ్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక్‌నగర్‌కు చెందిన పడాల కిషన్‌గౌడ్‌, అభిలాష్‌గౌడ్‌ ఇళ్లల్లో దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ నుంచి మత్తుపదార్థాలు తెచ్చి కల్తీకల్లు ఉత్పత్తిదారులకు సరఫరా చేయడానికి తీసుకురాగా ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే యాదవ భవన్‌కు సంబంధించి గోడప్రతులను జిల్లా యాదవకుల ప్రతినిధులు గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు గడ్డం సంతోష్‌యాదవ్‌ మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ గొల్ల, కుర్మ కులాలకు బాసటగా నిలబడుతూ విద్యార్థుల వసతి గృహాలు ఏర్పాటు చేయడానికి రూ. 80 లక్షలు మంజూరుచేశారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల పద్మాలయ జ్యోతిషాలయ వ్యవస్థాపకులు ప్రశాంత్‌జోషి రచించి ముద్రించిన క్యాలెండర్‌ 2018ని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌జోషి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా తాను అందిస్తున్న మహాకాలసూచిలను, పంచాంగాలను ఆదరిస్తున్న జిల్లా ప్రజలకు, వివిద సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు. కార్యక్రమంలో ఐబిఎస్‌ఎస్‌ నాయకులు, ఐజిబిఎపి సభ్యులు, డిఎఫ్‌ఐ ప్రతినిదులు సునీల్‌, రామకృష్ణ, మారుతి వర్మ, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, మారుతి శర్మ తదితరులు ...

Read More »

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

  నందిపేట, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 8 నూతన గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు కావడంతో మండల కేంద్రంలోని ఎంపిపి కార్యాలయం వద్ద గురువారం ఎంపిపి యమున, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు భూమేశ్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపి కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ది చెందితేనే బంగారు తెలంగాణ సాద్యమనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అధిక ...

Read More »

28న ఉపాధిహామీ ప్రజావేదిక

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాల నివారణ కోసం సోషల్‌ ఆడిట్‌ ప్రజావేదిక నిర్వహిస్తున్నామని ఇజిఎస్‌ ఎపిడి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామాలు, మండలాలవారిగా ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు బయటకు తీసేందుకు ఈనెల 28న మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ప్రజావేదిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమానికి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కూలీలు, ప్రజలు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో ఎంపిడివో రాములు నాయక్‌, ఎపివో సుదర్శన్‌ ...

Read More »

సంఘాలను బలోపేతం చేసేందుకే రుణాలు మంజూరు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని సంఘాలను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం స్త్రీనిది, బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేస్తుందని కామారెడ్డి జిల్లా స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలోని మండల సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్త్రీనిధి కింద 3 కోట్ల రూపాయలను సంఘ సభ్యులకు ఇచ్చేందుకు నిదులు అందుబాటులో ఉన్నాయన్నారు. 33 గ్రామ సంఘాలు రుణాలు తీసుకోవాలని అధ్యక్షులకు సూచించారు. ప్రతి గ్రామంలో స్వయం సహకార ...

Read More »

ప్రతి పాఠశాలలో ఇంటర్నెట్‌ సౌకర్యం

  గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఎంఇవో సేవ్లానాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన దీనికి సంబంధించిన జియో వైఫై డివైజ్‌లను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఇనుండి పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు పగటి భోజనం తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.

Read More »

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

  గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు నల్లమడుగు సురేందర్‌, వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న తెరాస ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. దీనిలో భాగంగానే ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. కుల రాజకీయాలు చేస్తున్న తెరాస పార్టీకి అవే కులాలు ...

Read More »

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన వ్యవసాయశాఖ మంత్రి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో సాయినాథుని శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నెమ్లి సాయిబాబా ఆలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ప్రవాస ఆంధ్రుల సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వయంగా మంత్రి శిబిరంలో పరీక్ష చేయించుకున్నారు. శిబిరానికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించారు. కార్డియాలజీ, న్యూరో సర్జన్‌, ఆర్థోఫిజిపైన్‌, జనరల్‌ సర్జన్‌, చైల్డ్‌ ...

Read More »

17 కోట్లతో బాన్సువాడలో ప్రసూతి కేంద్రం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్కారు దవాఖానాలు దేవాలయాలుగా విరజిల్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నెమ్లి గ్రామంలో గురువారం వెల్లనేస్‌ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నెమ్లి గ్రామంలో పట్లోల్ల బాల్‌రెడ్డి జ్ఞాపకార్థం పట్లోల్ల మోహన్‌రెడ్డి పేదవారందరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో సొంతంగా భవన నిర్మాణం చేపట్టి ప్రయివేటు ఆసుపత్రిని ప్రారంభించారని అట్టి దవాఖానాను ప్రభుత్వ పరంచేసి ...

Read More »