Breaking News

Daily Archives: December 22, 2017

మందకృష్ణపై కక్ష సాధింపులు మానుకోవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మందకృష్ణను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనపై కక్షసాధింపు వైఖరి మానుకోవాలని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగను అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాజధానిలో మరణించిన భారతి సాక్షిగా అఖిలపక్షాలను ఢిల్లీకి తీసుకెళతానని కెసిఆర్‌ మాట ఇచ్చి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి దళితుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ...

Read More »

శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రభుత్వ వెనకబడిన తరగతుల వసతి గృహాల విద్యార్థుల జిల్లా స్తాయి ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో జయాపజయాలు సాధారణమని, వీటిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలన్నారు. క్రీడాపోటీల్లో 400 మంది పాల్గొన్నారని, వచ్చే పోటీల్లో మొత్తం విద్యార్తులు పాల్గొనాలని సూచించారు. క్రీడలు చదువులో దిల్‌, ...

Read More »

చెట్ల ప్రాముఖ్యతను అందరికి చాటిచెప్పాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్ల ప్రాముఖ్యతను అందరికి చాటిచెప్పాలని, తద్వారా పర్యావరణంపై అవగాహన పెంచుకొనేవిధంగా చేయాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వాటరింగ్‌డేలో భాగంగా గాంధారి మండలం బూర్గుల్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికపాఠశాలలో ఆయన మొక్కలకు నీరుపోశారు. పాఠశాలలో వివిధ పూలమొక్కలతో పాటు కూరగాయల సాగు, చక్కని చెట్ల పెంపకాన్ని చూసి కలెక్టర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు సదాశివనగర్‌ ...

Read More »

ఎస్‌పి కార్యాలయంలో సమీక్ష సమావేశం

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి శ్వేతారెడ్డి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డిఆర్‌డిఎ పిడి, ఆర్‌అండ్‌బి, కోర్టు, ఎఎన్‌బిఐ, నేషనల్‌ హైవే, ఎక్సైజ్‌, హాస్పిటల్‌, పోలీసుతోపాటు వివిధ శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. పోలీసుశాఖతో వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయతీరును అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

డిసెంబరు చివరినాటికి భూ ప్రక్షాళన పూర్తిచేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు మాసాంతానికి రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన గాంధారి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కిచెన్‌ షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం మండల కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న మాన్యువల్‌ పహాణి కార్యక్రమం పరిశీలించారు. ప్రతి మండలంలో క్యాంపు నిర్వహించి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఎల్లారెడ్డి డివిజన్‌కు సంబంధించి 109 గ్రామాలకు గాను 7 గ్రామాలు పూర్తయ్యాయని, 25 గ్రామాల ...

Read More »

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

  – పిడిఎస్‌యు డిమాండ్‌ డిచ్‌పల్లి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని డివిజన్‌ మాజీ అధ్యక్షుడు సాయినాథ్‌ అన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటున్నారు, కానీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మాత్రం విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి కళాశాల నుండి తహసీల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. డివిజన్‌ అధ్యక్షుడు వరుణ్‌ ...

Read More »

ఎంఆర్‌పిఎస్‌ నాయకుల అరెస్టు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృస్ణ మాదిగ అరెస్టు నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌రోడ్డులోగల బోర్గం వంతెన వద్ద ధర్నాతలపెట్టిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి 4వ టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగపై లేనిపోని కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని, మందకృష్ణ మాదిగ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని లేనియెడల రానున్న ...

Read More »

సూర్యోదయ పాఠశాలలో గణిత దినోత్సవం

  నందిపేట, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని సూర్యోదయ పాఠశాలలో శుక్రవారం గణిత దినోత్సవం నిర్వహించినట్టు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని గణితశాస్త్రానికి సంబంధించిన వివిధ చార్డులు ప్రదర్శించారు. ప్రొజెక్టర్‌ ద్వారా రామానుజన్‌ జీవిత చరిత్రను తెలుసుకున్నారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో ఏఎస్‌ఐలుగా పనిచేస్తున్న ఐదుగురికి ఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. వీరు కరీంనగర్‌లో గత నాలుగు నెలలుగా ఎస్‌ఐలుగా శిక్షణ పొంది శుక్రవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయను మర్యాదపూర్వకంగా కలిశారు. కమీషనర్‌ వారిని అభినందించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందడం ద్వారా మరింత బాద్యత పెరిగిందని, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించాలని సిపి సూచించారు. ఎస్‌ఐలుగా పదోన్నతి పొందినవారిలో నిరంజన్‌, ఎం.రాములు, ...

Read More »

సాయిబాబా ఆలయంలో డిఎస్‌ ప్రత్యేక పూజలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ శుక్రవారం మాధవనగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిజామాబాద్‌ వచ్చిన డిఎస్‌ నగరానికి చేరుకున్న సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. డిఎస్‌ వెంట ఆలయ మాజీ ఛైర్మన్‌ ఆకుల చిన్న రాజేశ్వర్‌, నిజామాబాద్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు యాదగిరి, కార్పొరేటర్‌ రాజేశ్‌, మాజీ కార్పొరేటర్‌ రాజేంద్రప్రసాద్‌, తెరాస నాయకులు యెండల ప్రసాద్‌, పంచరెడ్డి ఎర్రన్న, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.

Read More »

టిఎన్‌జివోస్‌ భవనంలో క్రిస్మస్‌ వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని టిఎన్‌జివోస్‌ భవనంలో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర మేయర్‌ ఆకుల సుజాత, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతస్తుల పండుగలకు, పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తు వారి అభిమానం చూరగొంటున్నారని ...

Read More »

మెటర్నిటి ఆసుపత్రులను నిర్మిస్తాం

  – రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రత్యేక ప్రసూతి ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాల ...

Read More »

రైతు పండించిన పంటకు తమకు నచ్చిన ధరకు అమ్ముకునేందుకు పార్లమెంటులో చట్టం తేవాలి

  – ఏఐకెఎంఎస్‌ డిమాండ్‌ డిచ్‌పల్లి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని, వ్యవసాయరంగంలో ఏయేటికాయేడు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమయ్య అన్నారు. పుట్టెడు కష్టాలతో అప్పులు చేసి పంట పండిస్తున్న రైతులు తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకు వేసిన త్రిసభ్య కమిటీలు నామమాత్రంగా పనిచేస్తున్నాయన్నారు. ...

Read More »

డిసెంబరు చివరికల్లా భూ ప్రక్షాళన పూర్తిచేయాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల చివరి వరకు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం భూరికార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రాథమికంగా పూర్తయిందని, ప్రస్తుతం భూ రికార్డులకు సంబంధించి నెలకొన్న సమస్యలపై ఫారం -8 పొందుపరిచామని అట్టి సమస్యలపై ఈనెల 16 నుండి మండల కేంద్రంలో క్యాంప్‌ నిర్వహించి సమస్యలు పరిష్కారం చేసి ...

Read More »

సదరం క్యాంపు వాయిదా

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపును క్రిస్మస్‌ పండుగ సందర్బంగా వాయిదా వేసినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. సదరం క్యాంపునకు వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని, తిరిగి జనవరి 1 సోమవారం నుంచి యధావిధిగా సదరం క్యాంపు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More »

వెల్‌నెస్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నెమ్లి గ్రామంలో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించిన వెల్నెస్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆర్డీవో రాజేశ్వర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సరైన సమయానికి వచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల శ్రద్ద వహించాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బంది, తదితరులున్నారు.

Read More »

చెక్కు అందజేత

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం తిమ్మిరి గంగవ్వ అనే మహిళ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద రెవెన్యూ అధికారులు శుక్రవారం బాధితురాలికి రూ. 8 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బుద్దె గంగాధర్‌, ఆర్‌ఐ రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Read More »