Breaking News

Daily Archives: December 23, 2017

ఫీజుల కొరకు విద్యార్థులను వేధించవద్దు

  – ఎంఇవో నాగేశ్వర్‌రావు బీర్కూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల కొరకు విద్యార్థులను వేదించకూడదని బీర్కూర్‌ ఎంఇవో నాగేశ్వర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సన్‌ వే పాఠశాలలో యాజమాన్యం ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారన్న ఫిర్యాదుమేరకు పాఠశాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ఉపాధ్యాయుల కర్తవ్యమని, ఫీజుల పేరుతో విద్యార్థులలో న్యూనతా భావాన్ని నెలకొల్పవద్దని సూచించారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు ...

Read More »

ప్రేమోన్మాది దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం సంధ్యారాణి అనే యువతిపై దాడిచేసిన ప్రేమోన్మాది కార్తీక్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడసమీపంలో సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్‌ దాడిచేయడం గర్హణీయమన్నారు. మహిళలపై దాడులు అధికమయ్యాయని, ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సుధీర్‌, ప్రవీణ్‌, చిలుక నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పెద్దలను గౌరవించి సామాజిక నిర్మాతలుగా ఎదగాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దలను గౌరవించడం నేర్చుకొని సామాజిక నిర్మాతలుగా బతకాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. స్థానిక కర్షక్‌ బిఇడి కళాశాలలో శనివారం సీనియర్‌ సిటిజన్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జేసి మాట్లాడుతూ పెద్దలను గౌరవించాలని, పిల్లలు తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించాలని అన్నారు. బిఇడి విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా రాణించాలని సూచించారు. సీనియర్‌ సిటిజన్స్‌ను సన్మానించుకోవడం గొప్ప సంప్రదాయమని ప్రశంసించారు. కార్యక్రమంలో ...

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అందజేశారు. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన విఠల్‌కు రూ. లక్ష, మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌కు చెందిన వడ్ల ఆచారికి రూ. 27 వేల 500, భిక్కనూరుకు చెందిన వెంకటేశ్‌కు రూ. 75 వేలు, మొత్తం 2 లక్షల రెండున్నర వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు లక్ష్మిపతి ...

Read More »

ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్దం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో సక్కి రామకృష్ణకు చెందిన పెంకుటిల్లు ప్రమాదవశాత్తు కాలిపోయినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రమాదంలో బియ్యం, నిత్యవసర వస్తువులు, మోటర్‌ సైకిల్‌ ధ్వంసమయ్యాయని, సుమారు లక్ష 20 వేల ఆస్తినష్టం జరిగిందని విఆర్వో రాజు తెలిపారు.

Read More »

అక్షరలో క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకలను విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్‌ పాకను విద్యుత్‌ దీపాలతో అలంకరించి చిన్నారులు దేవదూతలు, పశువుల కాపరి వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగీతరెడ్డి కేక్‌కట్‌ చేసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, కరస్పాండెంట్‌ లోకేశ్‌రెడ్డి, ఇన్‌చార్జి రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణితంపై ఆసక్తి పెంచుకోవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణితంపై విద్యార్థులు భయాన్ని వీడి ఆసక్తిని పెంచుకుంటే సులభతరమవుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో తెలంగాణ గణితఫోరం ఆద్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్షల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టిఎంఎఫ్‌ ఆధ్వర్యంలో గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ ...

Read More »

కానిస్టేబుల్‌ కుటుంబానికి చెక్కు అందజేత

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించి నవంబర్‌ 10న మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి శనివారం జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి చెక్కు అందజేశారు. కానిస్టేబుల్‌ గోవర్ధన్‌రెడ్డి భార్య సద్గుణకు విడుదలైన రూ. 1 లక్ష 46 వేల 600 చెక్కును ఎస్‌పి అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఏఆర్‌ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ డిఎస్‌బి ప్రసాద్‌, రవిందర్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు షకీల్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆకుల రమేశ్‌ను పరామర్శించిన డిఎస్‌

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ శనివారం సీనియర్‌ న్యాయవాది ఆకుల రమేశ్‌ను పరామర్శించారు. రమేశ్‌తండ్రి ఆకుల చిన్న చిన్నయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రమేశ్‌ను ఓదార్చి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. డిఎస్‌ వెంట కార్పొరేటర్లు దారం సాయిలు, రాజేశ్‌, తెరాస నాయకులు ఆకుల చిన్న రాజేశ్వర్‌, ఎంపిపి యాదగిరి, రాజేంద్రప్రసాద్‌, శ్రీను, జీవన్‌ తదితరులున్నారు.

Read More »

ఆకుల రోహిత్‌ను అభినందించిన డిజిపి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 3న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు అందుకున్న ఆకుల రోహిత్‌ను శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ వివిధ పోటీల్లో రోహిత్‌ అసామాన్యమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గొప్పవిషయమని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. రోహిత్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న అతని తండ్రి ఆకుల రాంరెడ్డి (అడిషనల్‌ ...

Read More »

మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి వర్గీకరణపై నిరంతరం పోరాటం చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మందకృష్ణను అక్రమంగా అరెస్టు చేసి బెయిల్‌రాకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రబుత్వం పాల్పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై హామీ ఇచ్చి దీనిపై ఆలస్యం చేస్తుందని, దీనిపై ప్రశ్నిస్తున్న మందకృష్ణను అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మందకృస్ణ అరెస్టు అప్రజాస్వామ్యమని, వెంటనే ...

Read More »

కేసుల నిర్వహణలో అలసత్వం వద్దు

  – నిజామాబాద్‌ అదనపు డిసిపి శ్రీధర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసుల పర్యవేక్షణ విషయంలో పోలీసులు అలసత్వం వహించవద్దని నిజామాబాద్‌ అడిషనల్‌ డిసిపి శ్రీధర్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సోదాలు, అప్రమత్తత, నూతన చట్టాల విధి విధానాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నేరాలకు సంబంధించి చార్జిషీట్‌లు చట్టాలకు లోబడి దాఖలు చేయాలని జప్తులు చేసే సమయంలో పంచనామా నిర్వహించాలని, చట్టాలపై ప్రతి పోలీసు అధికారికి అవగాహన ఉండాలని ...

Read More »

30 కోట్లతో స్పైస్‌ పార్కు నిర్మాణం

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 30 కోట్లతో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ వద్ద స్పైస్‌ పార్కు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసంలో స్పైస్‌ పార్కు నిర్మాణ పనులపై సమీక్షించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వ్యాపారులకు విక్రయించుకునేందుకు ఈ పార్కు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించినట్టు తెలిపారు. కాంపౌండ్‌వాల్‌ నిర్మాణం ...

Read More »

యువతి ఆత్మహత్య

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బడా భీమ్‌గల్‌ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోట రాజమణి (22) అనే యువతి జీవితంపై విరక్తిచెంది గ్రామ పొలిమేరలోని శివాలయం గర్భగుడిలోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. సమీపంలోని భక్తులు గమనించి వెంటనే మంటలు ఆర్పి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి తల్లిదండ్రులు లేరని భీమ్‌గల్‌ ...

Read More »

చివరి ఆయకట్టుకు నీరందిస్తాం

  – తహసీల్దార్‌ కిష్టానాయక్‌ బీర్కూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రబీ పంట వేసుకునే రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని బీర్కూర్‌ తహసీల్దార్‌ కిష్టానాయక్‌ అన్నారు. మండలంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ రబీ పంట వేసుకునే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిజాంసాగర్‌ కాలువ ద్వారా విడతల వారిగా చివరి ఆయకట్టు వరకు నీరు అందజేస్తామని పేర్కొన్నారు.

Read More »

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

  – తప్పిన పెనుప్రమాదం నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తిరుపతి నుంచి నిజామాబాద్‌ వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బి-1 ఏసి బోగి పట్టాలు తప్పింది. దీంతో అరకిలోమీటరు మేర పట్టాలపై అదుపుతప్పిన చక్రాలు వెళ్ళాయి. రైలు పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, సమగ్ర విచారణ జరిపి ఘటనకు ...

Read More »

బీర్కూర్‌ ఏఎస్‌ఐగా లలిత

  బీర్కూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ ఏఎస్‌ఐగా లలిత శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బాన్సువాడలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారని పదోన్నతిపై బీర్కూర్‌ మండలంలో ఏఎస్‌ఐగా వచ్చినట్టు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి విధుల నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉంటానని ఏఎస్‌ఐ లలిత అన్నారు.

Read More »

పోచారం కాలనీలో చెత్తబుట్టల పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో శనివారం తెరాస సీనియర్‌ నాయకులు కొల్లి గాంధి ఆర్థిక సహాయంతో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చభారత్‌లో భాగంగా గ్రామంలో రోడ్లపై ఎవరు చెత్త వేయొద్దని, గ్రామ పారిశుద్యానికి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోసించాలని సూచించారు. బీర్కూర్‌ గ్రామంలో రూ. 15 వేలతో చెత్త బుట్టలు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గాండ్ల సంతోష్‌కుమార్‌, ...

Read More »

ప్రతి చేనుకు నీరివ్వడమే ప్రభుత్వ ధ్యేయం

  – ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఉమ్మెడ శివారులోని గోదావరి నదిపై నిర్మించిన అర్గుల రాజారాం, గుత్ప ఎత్తిపోతల పథకం నీటిని శనివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పంప్‌హౌజ్‌ స్విచ్‌ ఆన్‌చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి గుండెకాయలాంటి గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడానికి ఎంపి కవితతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి యాసంగి పంట సాగుకోసం నీటి ...

Read More »