Breaking News

Daily Archives: December 24, 2017

బిజెపిలో చేరిన పలువురు నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నగర బిసి మోర్చా అద్యక్షులు ఆకుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 7వ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు భారతీయ జనతాపార్టీలో చేరారు. అనంతరం 7వ డివిజన్‌ పరిధిలో పోలింగ్‌బూత్‌ కమిటీలు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సబ్యులు దొంతుల రవి, స్వామియాదవ్‌, భూపతి, పోశెట్టి, రాములు, కిషన్‌, 51వ, 52వ, 38వ బూత్‌ల నూతన ...

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు జిల్లా, రాష్ట్ర 2018 నూతన క్యాలెండర్‌ ను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తన స్వగృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాలెండర్‌ను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగకరంగా చక్కగా రూపొందించారని అన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ తయారీకి ఆర్థిక సహాయం అందజేసిన శివసాయి డెంటల్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎండిఎస్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ...

Read More »

వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద స్పూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని, ప్రపంచంలో భారతదేశం సమున్నత గౌరవ స్థానాన్ని సాధించేందుకు విద్యార్థుల కర్తవ్యం ఎంతో ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహప్రాంత ప్రచారక్‌ శ్రీధర్‌ అన్నారు. ఈ మేరకు కామారెడ్డిజిల్లా లింగాపూర్‌లోని ఎస్‌పిఆర్‌ పాఠశాలలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న కళాశాల విద్యార్థుల అరెస్సెస్‌ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరెస్సెస్‌ వ్యక్తినిర్మాణం ద్వారా దేశ పునర్నిర్మాణం కొరకు కృషి చేస్తుందని అన్నారు. 25వ తేదీ సాయంత్రం సార్వజనికోత్సవంతో ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కోటగల్లి మైసమ్మ ఆలయంలో ఆదివారం పద్మశాలి సంఘం 10వ నెంబరు తర్ప ఆద్వర్యంలో 2018 క్యాలెండర్‌ ఆవిస్కరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ ఆధ్వర్యంలో కాలసూచి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి బంధువులందరు కలిసికట్టుగా ఉండాలని, కలిసి ఉంటే అభివృద్ది చెందుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కారంపురి నర్సయ్య, ఉపాధ్యక్షుడు రాజయ్య, ఎస్‌.రమణయ్య, సంయుక్త కార్యదర్శి వేముల సత్యనారాయణ, బళ్ల రవిందర్‌, కోశాధికారి ప్రసాద్‌, ...

Read More »

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

  – రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌ గ్రామంలో నిజాంసాగర్‌ కెనాల్‌ ద్వారా 2వ విడత వరిపంటకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు రైతులకు నీటిని అందిస్తామని, రైతులకు రుణమాఫీ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ...

Read More »

మాడ్రన్‌ పబ్లిక్‌ స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఆదివారం మాడ్రన్‌ పబ్లిక్‌ స్కూల్‌ 1991-92 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. వివిద రంగాల్లో స్థిరపడి అందుబాటులో ఉన్న 64 మంది విద్యార్థులు కుటుంబ సమేతంగా కలిసి ఒకే వేదికపై అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తమతోపాటు చదువుకొని మృతి చెందిన మిత్రులను స్మరించుకొని నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి ...

Read More »

క్రైస్తవులకు పోలీసు కమీషనర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోగల క్రైస్తవులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలని, ఈర్ష్యా, ద్వేషం, అసూయ విడనాడి ప్రేమ అనే దీపం వెలిగించి ఇతరులకు వెలుగునివ్వాలని కమీషనర్‌ ఆకాంక్షించారు. అదేవిధంగా పండగను పురస్కరించుకొని ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు.

Read More »

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరన్‌రెడ్డి ఆదివారం నిజామాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల ఇంటికి వెళ్లి పలకరించారు. ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే, మంత్రిని శాలువాతో సత్కరించారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్టు ఎమెల్యే వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, బాసర ఆలయ కమిటీ డైరెక్టర్‌ రాజు, ఎమ్మెల్యే బిగాల తండ్రి బిగాల నారాయణ గుప్త, తెరాస ఫ్లోర్‌ లీడర్‌ ...

Read More »

రిప్రాక్టో కంటి ఆసుపత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌రోడ్డులోగల రిఫ్రాక్టో కంటి ఆసుపత్రిని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని సౌకర్యాలతో కూడిన కంటి సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిజామాబాద్‌లో స్తాపించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. ఎమ్మెల్యేతోపాటు నగర మేయర్‌ ఆకుల సుజాత, బిజెపి సీనియర్‌ నాయకులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీధర్‌ గుప్త, తెరాస ...

Read More »

ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, విశిష్ట అతిథిగా నగర మేయర్‌ ఆకుల సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రెస్‌క్లబ్‌ సభ్యులు తమ ఐకమత్యాన్ని చాటుతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్‌ క్రైస్తవుల సంక్షేమం కోసం కృసి చేస్తున్నారని, క్రిస్టియన్‌ ...

Read More »

రైతు సంక్షేమాన్ని మరిచిన మోడి ప్రభుత్వం

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సంక్షేమాన్ని బిజెపి ప్రభుత్వం విస్మరించిందని అఖిలభారత రైతు సంఘం రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ...

Read More »

పేద క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని పేద క్రిస్టియన్లకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం 60కి పైగా బట్టల జతలను అందించారు. సోమవారం జరిగే పండగ సందర్భంగా పేదలందరు కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో నిరుపేదలను గుర్తించి బట్టలు అందించినట్టు క్లబ్‌ అధ్యక్షుడు రమేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు ప్రవీణ్‌, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాష్ట్రపతిని కలిసిన మంత్రి, ఎంపి

  కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శీతాకాల విడిదికోసం హైదరాబాద్‌ విచ్చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి, ఎంపి బిబి పాటిల్‌లు స్వాగతం పలికారు. హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన రాష్ట్రపతికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

Read More »

బంజారాల అభ్యున్నతికి కృషి చేస్తా

  బంజారా సేవా సంఘం జిల్లా అద్యక్షునిగా బద్యానాయక్‌ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు కామరెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారాల అభ్యున్నతికి అందరి సహకారంతో ముందుకెళతానని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అధ్యక్షుడు బద్యానాయక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని బాబాగౌడ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఆలిండియా బంజారా ఎన్నికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1953లో బంజారా అభివృద్ది సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరిజనుల భూవివాదాలు, పేదరికం తదితర విషయాలను ప్రభుత్వ దృష్టికి ...

Read More »