Breaking News

Daily Archives: December 25, 2017

ఘనంగా వాజ్‌పాయ్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 93వ జన్మదిన వేడుకలను సోమవారం బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మురళీగౌడ్‌ మాట్లాడుతూ వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్దికి పాటుపడ్డారన్నారు. ఆయన ఒక వ్యక్తికాదు,శక్తి అని కొనియాడారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అటక్‌ నుంచి కటక్‌ వరకు గ్రామ గ్రామానికి సడక్‌ యోజన చేపట్టారని ...

Read More »

ఘనంగా గురుగోవింద్‌ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కు సోదరుల గురువు గోవింద్‌ మహారాజ్‌ 351 జయంతి ఉత్సవాలు సోమవారం గాజుల్‌పేట్‌లోని గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గనేశ్‌ గుప్త హాజరై మాట్లాడారు. గురుగోవింద్‌ సింగ్‌ సిక్కులతోపాటు యావత్‌ దేశానికి సంబంధించిన దైవమని, ఆయన మార్గాన్ని అనుసరించి ఉన్నత జీవనవిధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం సిక్కు సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Read More »

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి సోమవారం క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామంలో, జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామంలో పర్యటించి సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక ఏసుక్రీస్తు అని, ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో అవసరమని అన్నారు. అనంతరం కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

గోడప్రతుల విడుదల

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోగల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న రాజ్యహింస ప్రతిఘటన సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సిపిఐ (ఎంఎల్‌), న్యూడెమోక్రసి (చంద్రన్న) పార్టీ కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎం.రమేశ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభకు వామపక్ష పార్టీల నాయకులు, అభ్యుదయ సంఘాల ప్రతినిదులు, మహిళా సంఘాలు, జేఏసి ...

Read More »

భక్తి శ్రద్దలతో క్రిస్మస్‌ వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సోమవారం క్రిస్మస్‌ పంఢుగను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. చర్చిలను అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలోగల సిఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి కుటుంబీకులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కీర్తనలు ఆలకించి సంతోషంగా గడిపారు. సిఎస్‌ఐ చర్చితోపాటు నగరంలోని హోలిమేరి చర్చి, పెంటకొస్తు చర్చి, ...

Read More »

ఘనంగా అటల్‌బిహారి వాజ్‌పాయ్‌ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 93వ జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఉదయం సార్వజనిక్‌ గణేశ్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఖిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ...

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం భవనం విస్తరణ పనులకు సిడిపి నిధుల ద్వారా రూ. 10 లక్షలు కేటాయించారు. సీతాయిపల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘ భవనానికి రూ. 3 లక్షలు, ఎస్‌సి సంఘం ప్రహరీ నిర్మాణానికి రూ. 2 లక్షలు, గ్రామ పంచాయతీ భవనానికి రూ. 2 లక్షలు, మోబిన్‌ తాండా సంఘానికి రూ. ...

Read More »

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందంగా అలంకరించిన చర్చిల వద్ద ఏసుక్రీస్తు జననానికి సంబంధించిన పాక, పశువులు తయారుచేశారు. ఏసుక్రీస్తు మార్గంలో నడుచుకోవాలని, సన్మార్గంలో పయనించాలని ఫాదర్‌లు భక్తులకు సూచించారు.

Read More »

దేశభక్తిని పెంపొందించడమే ఆరెస్సెస్‌ లక్ష్యం

  కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతతో పాటు ప్రజల్లో దేశబక్తిని పెంపొందించడమే ఆరెస్సెస్‌ లక్ష్యమని ఆరెస్సెస్‌ ప్రచారక్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సార్వజనికోత్సవం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 55 వేల గ్రామాల్లో ఆరెస్సెస్‌ శాఖలు పనిచేస్తున్నాయని, అలాగే 33 దేశాల్లో కూడా ఆరెస్సెస్‌ శాఖలున్నాయన్నారు. 1925లోస్థాపించబడిన ఆరెస్సెస్‌ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలతో పాటు దేశభక్తి, తదితర కార్యక్రమాల్లో ముందుందన్నారు. ...

Read More »

మందకృష్ణ మాదిగను విడుదల చేయాలి

  – అఖిలపక్ష నాయకుల డిమాండ్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో అరెస్టు చేయబడిన ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను ప్రభుత్వంవెంటనే విడుదల చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. మందకృష్ణ మాదిగ విడుదల కోరుతూ సోమవారం కామారెడ్డిలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆద్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈనెల 27వ తేదీ లోగా మందకృష్ణను విడుదల చేయకపోతే ఎంఆర్‌పిఎస్‌ సూచించిన బంద్‌ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ...

Read More »

దాడులను ఖండించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లోని శాతవాహన యూనివర్సిటీలో సోమవారం వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడిచేసిన సంఘటనను తీవ్రంగా ఖండించాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు భానుప్రసాద్‌, ప్రవీణ్‌లు డిమాండ్‌ చేశారు. ఏబివిపి, ఆరెస్సెస్‌ తదితర సంఘాల నాయకులు అకారణంగా వామపక్ష విద్యార్థి నాయకులపై దాడి చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన విద్యార్తి సంఘాల నాయకులను విడుదల చేయాలన్నారు.

Read More »

తెరాసలో చేరిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కన్కల్‌ మాజీ సర్పంచ్‌ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో 50 మందికిపైగా కార్యకర్తలు సోమవారం తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. తెరాస పార్టీ చేస్తున్న అభివృద్ది పనులను చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న హెర్తులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం టర్బయిన్‌లలోకి 1720 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో 3.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన అవుతూ నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న యాసంగి పంటల కోసం సాగునీటిని అందించేందుకు నీటిపారుదల శాకాధికారులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు కింద 2 లక్షల 10 వేల ఎకరాలకు యాసంగి సాగుకోసం ఏడు విడతలుగా నీటిని విడుదలచేసేందుకు ...

Read More »