Breaking News

ఘనంగా అటల్‌బిహారి వాజ్‌పాయ్‌ జన్మదిన వేడుకలు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 93వ జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఉదయం సార్వజనిక్‌ గణేశ్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఖిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో 4వ జోన్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా ఛత్రపతి హనుమాన్‌ మందిరంలో కూడా అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ వాజ్‌పాయ్‌ దేశానికి ఎంతో సేవచేశారని, ఆయన సేవలు ఎనలేనివని, ఈరోజు దేశం అభివృద్ది రంగంలోముందుకు పోతుందంటే దానికి వాజ్‌పాయ్‌ సంస్కరణలే మూలమని, రక్షణ రంగంలో ప్రపంచంలో భారతదేశం బలవంతంగా మారడానికి వాజ్‌పాయ్‌ కారకులని అన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బస్వ లక్ష్మినర్సయ్య, యెండల సుధాకర్‌, స్వామి యాదవ్‌, మల్లేశ్‌ యాదవ్‌, మచ్చల్‌ శ్రీనివాస్‌, గంగోని కిషన్‌, చంద్రకళ, సుగుణ, శైలజ, రాజశేఖర్‌, సంగమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కళ్యాణ్‌, నవీన్‌, రోశన్‌, యశ్వంత్‌ తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *