Breaking News

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం భవనం విస్తరణ పనులకు సిడిపి నిధుల ద్వారా రూ. 10 లక్షలు కేటాయించారు. సీతాయిపల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘ భవనానికి రూ. 3 లక్షలు, ఎస్‌సి సంఘం ప్రహరీ నిర్మాణానికి రూ. 2 లక్షలు, గ్రామ పంచాయతీ భవనానికి రూ. 2 లక్షలు, మోబిన్‌ తాండా సంఘానికి రూ. 3 లక్షలు, దుబ్బాక సల్పబండ తాండాలో యువజన సంఘానికి రూ. 4 లక్షలు, ధర్పల్లి మండల కేంద్రంలోని గొల్ల కుర్మ సంఘానికి రూ. 3 లక్షలు, మంగళి సంఘానికి రూ. 4 లక్షలు, ముదిరాజ్‌ సంఘానికి రూ. 4 లక్షలు, ఎన్‌టిఆర్‌ కాలనీలోని గోసంగి సంఘ భవనానికి రూ. 3 లక్షలు, ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో రైతు సంఘానికి రూ. 10 లక్షలు, ధర్పల్లి మండల కేంద్రంలోని దళిత సంఘ భవనానికి రూ. 3 లక్షలు, మోడల్‌ స్కూల్‌ భవనానికి రూ. 5 లక్షలు, జంగం భవనానికి రూ. 3 లక్షలు కేటాయించారు. మొత్తం 59 లక్షలు వివిధ సంఘాలకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కేటాయించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *