Breaking News

ఘనంగా వాజ్‌పాయ్‌ జన్మదిన వేడుకలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 93వ జన్మదిన వేడుకలను సోమవారం బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మురళీగౌడ్‌ మాట్లాడుతూ వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్దికి పాటుపడ్డారన్నారు. ఆయన ఒక వ్యక్తికాదు,శక్తి అని కొనియాడారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అటక్‌ నుంచి కటక్‌ వరకు గ్రామ గ్రామానికి సడక్‌ యోజన చేపట్టారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టం సిద్దిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్‌ తేలు శ్రీనివాస్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేశ్‌రెడ్డి, నాయకులు పేర రమేశ్‌, సుధాకర్‌, రాజలింగం, సంతోస్‌రెడ్డి, నవీన్‌గౌడ్‌, సతీస్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *