Breaking News

భూత వైద్యుని పరాకాష్ట

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో గల నిజాంకాలనీలో ఓ భూత వైద్యుని చేష్టలకు ఓ అమాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌.కె.ఇజాజ్‌ (20) అనే యువకుడికి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతని కుటుంబీకులు అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ భూతవైద్యుని వద్దకు సోమవారం అర్ధరాత్రి సమయంలో తీసుకెళ్లారు. భూతవైద్యుడు ఎజాజ్‌ ముఖంపై నీళ్లు చల్లడంతో ఎజాజ్‌ తిరగబడ్డాడు. దీంతో భూతవైద్యుడు అతన్ని మంటల్లో నెట్టివేయడంతో ఎజాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు, కుటుంబీకులు ఎజాజ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు పిర్యాదు చేశారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *