Breaking News

ఘనంగా సిపిఐ ఆవిర్భావ వేడుకలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఆవిర్భావ వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బతుకమ్మ కుంట కాలనీలో పార్టీ జెండా జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సిపిఐ పార్టీ ముందుందన్నారు. గత 92 సంవత్సరాలుగా కేంద్రంలో యుపిఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తు పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యల సాధనలో పార్టీ ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు దశరథ్‌, బాల్‌రాజు, బాలు, రాములు, నర్సింలు, తదితరులున్నారు.

Check Also

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *