Breaking News

రోహింగ్యా ముస్లింలకు దేశంలో ఆశ్రయం కల్పించొద్దు

 

– ఆరెస్సెస్‌ తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో రోహింగ్యాముస్లింలకు ఆశ్రయం కల్పించవద్దని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌ అన్నారు. మంగళవారం ఆరెస్సెస్‌ కళాశాల విద్యార్థుల శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. రోహింగ్యా ముస్లింలు మయన్మార్‌ దేశంలో మారణహోమం సృష్టించారని, అలాంటి వారిని మన దేశంలో ఆశ్రయం ఇవ్వాలని ఎంఐఎం అదినేత అసదుద్దీన్‌ ఓవైసి డిమాండ్‌ చేయడం దేశ ద్రోహమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మన దేశంలో స్థానం కల్పిస్తే మాయన్మార్‌లో ఏర్పడిన పరిస్థితులు ఇక్కడ కూడా పునరావృతమవుతాయని, ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో వారి అలజడి మొదలైందని, అసదుద్దీన్‌ డిమాండ్‌కు తలొగ్గి మన ప్రభుత్వం ఒప్పుకుంటే తెలంగాణ కూడా మరో పశ్చిమబెంగాల్‌ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

దేశం గురించి మాట్లాడితే హిందూ మతోన్మాదం అంటున్నారని, మన సంస్కృతి గురించి మాట్లాడితే తప్పా అని దేవేందర్‌ ప్రశ్నించారు. దేశంలో కుహనా లౌకిక వాదం ఎక్కువైపోయిందని, రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, హిందువులంతా సంఘటితమై దేశాన్ని కాపాడుకునే సమయం ఆసన్నమైందని దేవేందర్‌ సూచించారు. అంతకుముందు స్వయంసేవకులు నగరంలో భారీ పథ సంచలన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శారీరక ప్రదర్శనలు, సూర్యనమస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజారాం, శిబిర అధికారి శ్రీనివాస్‌, విభాగ్‌ కార్యవాహ బలవత్రి గణేశ్‌, బిజెపి, విహెచ్‌పి, ఏబివిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *