Breaking News

గుండెపోటుతో మాజీ కౌన్సిలర్‌ మృతి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్‌ గౌరాని లింబాద్రి (60) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. లింబాద్రి బిజెపి తరఫున 1995, 2005 ఎన్నికల్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రిజర్వేషన్‌ అనుకూలించకపోవడంతో భార్య విజయను బరిలోదింపి విజేతగా గెలిపించుకున్నారు.

బిజెపిలో సీనియర్‌ నాయకుడిగా మంచి పేరు సంపాదించారు. ఇటీవల తెరాస పార్టీలో చేరారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ అజాతశత్రువుగా పేరు సంపాదించుకున్న లింబాద్రి అకస్మాత్తుగా మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను, ఇటు ఆయా పార్టీ నాయకులను శోకసంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, తెరాస నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ మసూద్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు భూంరెడ్డి, కుంభాల రవి, కృస్ణమోహన్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, తెలంగాణ అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మురళీధర్‌గౌడ్‌, నాయకులు జూలూరి సుధాకర్‌, చింతల రమేశ్‌, పేర రమేశ్‌, తదితరులు పరామర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో లింబాద్రి అంత్యక్రియలు నిర్వహించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *