Breaking News

29న హైదరాబాద్‌లో గొల్ల కుర్మల భవనం ప్రారంభోత్సవం

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 29న ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా గొల్ల కుర్మల సంక్షేమ భవనం ప్రారంభం కానుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రబాకర్‌ యాదవ్‌ తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని గొల్ల కుర్మ సభ్యులందరు 29న హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు. గొల్ల కుర్మల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు చేపడుతుందని, కులస్తులందరు ముందుకు వచ్చి సమస్యలు తెలిపితే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటేశ్‌ యాదవ్‌, రాజు, యాదగిరి, సంజీవులు, అర్జున్‌ తదితరులున్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *