Breaking News

మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రిలో అరుదైన చికిత్స

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రిలో ఆదివారం అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వేల్పూర్‌ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బి.గంగారెడ్డి ఆదివారం తీవ్రమైన కడుపునొప్పితో తమవద్దకు రావడంతో వైద్యులు ఆయన్ను పరీక్షించగా గంగారెడ్డి రక్తంలో హిమోగ్లోబిన్‌ 4 శాతం తక్కువగా ఉందని, కిడ్నీ పనితనం తగ్గి పియోటిన్‌లో ప్రవేశించిందని, దీనికితోడు పీహమ్‌ (స్పెన్‌) ముక్కలు ముక్కలైనట్టు పరీక్షలో గుర్తించారు. వీటి ప్రభావం వల్ల అతను లోబిపి బారిన పడడం, గుండెపనితీరు సరిగా లేకపోవడంతో వైద్య బృందం అత్యవసర శస్త్ర చికిత్స చేసి పీహమ్‌ తొలగించినట్టు తెలిపారు.

h bదీని ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా వ్యాక్సిన్‌ అందించి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్టు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలో అరుదైన వ్యాధి అని, ఈ లక్షణం గల రోగులు ఐదు లేదా ఆరుగురిని గుర్తించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం గంగారెడ్డి పరిస్థితి బాగుపడిందని, మరో రెండురోజుల్లో ఇంటికి పంపుతామని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్‌ రాజ్‌కమల్‌గౌడ్‌, డాక్టర్‌ భైరవ్‌, డాక్టర్‌ అమర్‌బాబు, ఆసుపత్రి ఎజిఎం శ్రీనివాస్‌ శర్మ పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *