Breaking News

బస్టాండ్‌పైకప్పుకూలి ఇద్దరికి తీవ్ర గాయాలు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బస్టాండ్‌లో మంగళవారం 16వ నెంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న తాత్కాలిక రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలడంతో మాక్లూర్‌ మండలం చిక్లి గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మి, బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఉత్తమ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ప్రయాణీకులు, ఆర్టీసి అధికారులు హుటాహుటిన బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్‌లో నత్త నడకన కొనసాగుతున్న ప్లాట్‌ ఫాం అభివృద్ది పనులపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *