Breaking News

ఒకరి ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి గ్రామ పరిధిలో తన ప్లాటుకు మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ ఉన్నట్టు తేలడంతో ఓ బాధితుడు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రయివేటు డాక్యుమెంటరీ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి… గుండారం గ్రామానికి చెందిన పట్ల నర్సింలు, ప్రసాద్‌, రాములు అనే వ్యక్తుల వద్ద 200 గజాల జాగను రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. ఇంటి నిర్మాణ విషయంపై అక్కడికి వెళ్లగా మరికొందరు తామే ముందు కొనుగోలు చేసినట్టు తెలపడంతో బాధితుడు భూమిని విక్రయించిన వారి వద్ద ఆందోళన వ్యక్తం చేసి కిరోసిన్‌ పోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఇరువురిని శాంతింపజేసి సమస్య పరిష్కారానికి చర్చలు జరిపారు.

Check Also

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *