Breaking News

వరంగల్‌లో పత్తి కొనుగోలును పర్యవేక్షించిన ఏఎంసి ఛైర్మన్‌

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రమిలా వెంకట్‌ రాంరెడ్డి పిట్లం మార్కెట్‌ కమిటీ పాలకవర్గం సభ్యులతో కలిసి బుధవారం వరంగల్‌ జిల్లా కేంద్రంలోగల వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సందర్శించారు. కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు మార్కెట్‌ కమిటీ సౌకర్యాలు రైతులకు కల్పించడం పరిశీలించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, ప్రతి రైతుకు వారు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పొందుతున్నారని ఛైర్మన్‌ పేర్కొన్నారు. వీరిలో వైస్‌ఛైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, విండో ఛైర్మన్‌ గోపాల్‌ రావు, డైరెక్టర్‌లు సాయిరెడ్డి, యూసుబ్‌, తుక్యానాయక్‌, పడిగెల రమేశ్‌, సత్యనారాయణ, సంతోష్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *