Breaking News

నేరాలు తగ్గుముఖం

 

– జిల్లా ఎస్‌పి శ్వేతా

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు సంవత్సరాల కంటే ఈ యేడు నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక డిపివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక నేర నివేదిక సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలో కొద్ది నెలల క్రితం రైస్‌మిల్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందేనన్నారు. ఇందులో పోలీసుల సమన్వయంతో 24 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 69 సిసి కెమెరాల ద్వారా వివిధ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. జిల్లాలోని వ్యాపారస్తులు, కాలనీ వాసులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. జిల్లాలో మద్యం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, బెల్టుషాపులు వివిధ కేసులు అత్యధికంగా ఉన్న పోలీసు స్టేషన్ల అధికారులను, పోలీసు స్టేషన్‌లో పనిచేసిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో డిఎస్‌పి ప్రసన్న, సిఐలు శ్రీధర్‌కుమార్‌, భిక్షపతి, ఎస్‌ఐలు ఉన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *