Breaking News

బంగారు తెలంగాణ కావాలంటే బంగారు పంటలు పండాలి

 

– ఇజ్రయిల్‌ తరహా వ్యవసాయం చేయాలి

– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

– రిలయన్స్‌ ఆద్వర్యంలో కిసాన్‌ సమ్మేళనం

గాంధారి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక రాష్ట్రం బంగారు తెలంగాణగా ఎదగాలంటే రైతులు బంగారు పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధారి మండలంలోని కరక్వాడి గ్రామంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు ఆదర్శవంతమైన వ్యవసాయం చేయాలని, ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రిప్‌ ద్వారా పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలన్నారు. ఇజ్రాయిల్‌లో ఇదే తరహా వ్యవసాయం చేస్తున్నారని, ప్రపంచానికి ఇజ్రాయిల్‌ వ్యవసాయం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో సుమారు 1200 మంది వ్యవసాయ అధికారులను ఇజ్రాయిల్‌ పంపిస్తున్నామన్నారు. గ్రామాలన్ని ఇజ్రాయిల్‌ వలె తయారుకావాలన్నారు. సాంకేతిక సహకారం రిలయన్స్‌ వారు అందిస్తారన్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కిసాన్‌ సమ్మేళనం నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల అభివృద్ది కొరకే ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసిందన్నారు. రైతు కష్టజీవి, సంఘ జీవి అన్నారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలుగా సహకరిస్తున్న రిలయన్స్‌ బృందానికి అభినందించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించాలన్నారు.

కార్యక్రమంలో జడ్పిటిసి తానాజీరావు, ఎంపిపి యశోదాబాయి, ముకుందరావు, శివాజీరావు, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, రిలయన్స్‌ ప్రతినిధులు రామకృష్ణ, రాజేశ్‌, బాబురావు, వివిధ గ్రామ సంఘాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *