Breaking News

 ★ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ

 ★ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ
★ వి వాంట్ హైకోర్ట్‌…
★ పార్ల‌మెంటులో టీఆర్ఎస్ ఎంపీల ప‌ట్టు
★ హైకోర్టు విభజనపై ఆలస్యమెందుకు? :ఎంపీ జితేందర్‌
రెడ్డి
★ కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన
చేయాలి : ఎంపీ కవిత
★ హామీలు కాదు.. ప్రకటన కావాలి : ఎంపీ వినోద్
★ టీఆర్‌ఎస్ ఎంపీల పట్టుదలతో లోక్‌సభ రెండుసార్లు
వాయిదా
★ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అత్యవసరం : కేంద్రమంత్రి
★ దిగొచ్చిన కేంద్రం – రేపు సభలో ప్రకటన : కేంద్ర మంత్రి

జై తెలంగాణ నినాదాలతో లోక్‌సభ మళ్లీ మార్మోగింది. హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో గళమెత్తారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఎంపీలు క‌విత‌, జితేంద‌ర్ రెడ్డిలు వెల్‌లోకి దూసుకువెళ్లిన‌వారిలో ఉన్నారు. దీంతో లోక్‌సభ స్తంభించిపోయింది. మ‌రోవైపు ఇత‌ర విప‌క్ష పార్టీలు కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ హైకోర్టు అంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు నిన‌దించారు.

హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడింది. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పోరాడుతామని ఎంపీలు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆగదని టీఆర్‌ఎస్ ఎంపీలు తేల్చిచెప్పారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత చెప్పినప్పటికీ టీఆర్‌ఎస్ ఎంపీలు శాంతించకపోవడంతో.. లోక్‌సభ మ‌ళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

హైకోర్టు విభజనపై జాప్యమెందుకు? : ఎంపీ కవిత
——————————————-

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన కోరుతూ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏపీ స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుపై నెపం నెట్టడం భావ్యం కాదన్నారు.

వి వాంట్ హైకోర్ట్‌…పార్ల‌మెంటులో టీఆర్ఎస్ ఎంపీల ప‌ట్టు
————————————————-

లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. వి వాంట్ హైకోర్టు అంటూ ఎంపీలు నినదించారు. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు విభజనపై కేంద్రం జాప్యం చేస్తోందని ఎంపీలు మండిపడ్డారు. చట్టసభల వేదికగా ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. హైకోర్టును విభజన చేయాలంటూ సభలో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. హైకోర్టు విభజనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎంపీలు నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజనను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజనకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని ఎంపీలు స్పష్టం చేశారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

హైకోర్టు విభజనపై ఆలస్యమెందుకు? :ఎంపీ జితేందర్‌రెడ్డి
—————————————————

హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజనలో అప్పటి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేదని ఎంపీ జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టును విభజించకపోవడం వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. చట్టసభల వేదికగా గతంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సదానంద గౌడ, వెంకయ్యనాయుడు హైకోర్టు విభజనపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ హామీలు అమలు కావడం లేదన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టుకు ల్యాండ్, భవనం కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. హైకోర్టును విభజించకపోవడానికి గల రహస్యమేంటో చెప్పాలని ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

హామీలు కాదు.. ప్రకటన కావాలి : ఎంపీ వినోద్
—————————————-

హైకోర్టు విభజనపై హామీలు కాదు.. స్పష్టమైన ప్రకటన రావాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ర్టాలకు న్యాయం చేయలేకపోతుందన్నారు. హైకోర్టు తెలంగాణ సమస్యలను తెలంగాణ కోణంలో పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి హైకోర్టు నియామకాల్లో స్పష్టత లేదని ఎంపీ వినోద్ తెలిపారు.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అత్యవసరం : కేంద్రమంత్రి
————————————–————

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అత్యవసరమని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అనంత్ కుమార్ సభలో మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశాన్ని న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అంశం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఇవాళ సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు లేవనెత్తిన అంశం కీలకమైనది అని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయని.. అదే విధంగా తెలంగాణకు కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ తెలిపారు.

హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు సభలో ఇవాళ ఉదయం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు విభజనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. వి వాంట్ హైకోర్టు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లిన ఎంపీలు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో సభ దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత.. టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ హైకోర్టు విభజనపై స్పందిస్తూ.. ఈ అంశాన్ని న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.

Check Also

భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం ఆందోళన

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఐక్య బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *