Breaking News

మానవజన్మ సార్థకం కావాలంటే భక్తిమార్గాన్ని ఎంచుకోవాలి

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు వారి జన్మ సార్థకం చేసుకోవాలంటే భక్తిమార్గాన్ని ఎంచుకోవాలని బిచ్కుంద మఠాధిపతులు బండాయప్ప స్వామి అన్నారు. ఆయన పిట్లం మండల కేంద్రంలో సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్న తెలంగాణ జానపద మండల స్థాయి భజన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత భక్తిమార్గాన్ని ఎంచుకోవాలని, పిట్లంలో భక్తి గీతాలతో కలిగిన భజన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ద్వాపర యుగంలో భజన పాటల ద్వారా వర్షాలు కురిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో బొంతపల్లి కృష్ణమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథం, మల్లికార్జున్‌, సిద్దయ్యస్వామి, సర్పంచ్‌, గంగారాం, గాంధీగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *