Breaking News

మినీ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ వ్యవసాయ కార్యాలయంలో బుధవారం మినీ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో బీర్కూర్‌ గ్రామానికి సంబంధించిన రైతుల మట్టినమూనాలను ఇదివరకే సేకరించినవి ఇప్పుడు ఈ మినీ భూసార కేంద్రంలో పరీక్షించి వాటి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి అనంతరం రైతులకు భూమి, ఆరోగ్య కార్డులు అందజేస్తామని బీర్కూర్‌ ఏఈవో శ్రావణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం సామర్థ్యం 100 మట్టినమూనాలు మాత్రమే పరీక్ష చేయడానికి సరిపోతుందని చెప్పారు. మిగతా సేకరించిన మట్టి నమూనాలను దగ్గర్లోని ప్రాంతీయ భూసారకేంద్రం బోధన్‌ లేదా నిజామాబాద్‌కు పంపించి వాటి ఫలితాలను కూడా వారి నుంచి సేకరించి రైతులకు అందజేస్తామని చెప్పారు. ఇలాంటి మినీ భూసార కేంద్రాలు మండలంలో బైరాపూర్‌, దామరంచలో కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో అక్కడకూడా పరీక్షలు చేస్తామన్నారు. ఒకేసారి నేలలోని ఒక సర్వేనెంబరులోని మట్టి పరీక్ష ఫలితం అందజేస్తే అది రెండు సంవత్సరములకు పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బైరాపూర్‌ ఏఈవో కావ్యశ్రీ, దామరంచ ఏఈవో అపర్ణ, నసురుల్లాబాద్‌ ఏఈవో దత్తేశ్వరి పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *