Breaking News

రోహిదాస్‌ (మోచి) కులసంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రంలో బుధవారం శ్రీరోహిదాస్‌ (మోచి) కుల సంఘం 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రతినిధులు, స్థానిక ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని అన్ని మండలాల్లో పర్యటించి మోచి కులస్తులను ఏకం చేస్తు సంఘం అభివృద్దికి కులస్తుల ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్‌ కేంద్రం మోచి కులస్తులు అంబిల్‌పూర్‌ అశోక్‌, అంబిల్‌పూర్‌ రాజు, లింగం, జయరాం, గంగారాం, బలరాం, సతీష్‌, క్రాంతి, గంగారాంతోపాటు గణపతి, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *