Breaking News

అయ్యప్ప ఆలయానికి ఎంపి విరాళం

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోగల అయ్యప్ప ఆలయానికి జహీరాబాద్‌ ఎంపి బిబి.పాటిల్‌ తనస్వంతంగా రూ. 2 లక్షల రూపాయల చెక్కును బుధవారం జిల్లా ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు జగదీష్‌, వైస్‌ ఎంపిపి నర్సాగౌడ్‌ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. గత యేడాది ఎంపి బి.బి.పాటిల్‌ ఆలయ ప్రాంగణంలో మార్బల్‌ గ్రానైట్‌ విరాళంగా ఇస్తానని, ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని జగదీష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, భగవాన్‌, వెంకట్‌రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు నవీన్‌, అయ్యప్పదీక్షా స్వాములు పాల్గొన్నారు.

Check Also

పుట్ట ఎల్లమ్మకు పూజలు

నందిపేట్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం నుండి గౌడ సంఘం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *