Breaking News

ముగ్గురు దొంగల అరెస్టు

 

-డిఎస్‌పి ప్రసన్న

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిఎస్‌పి ప్రసన్న తెలిపారు. బుధవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ అయాబ్‌ఖాన్‌, షేక్‌ వాసిమ్‌, షబ్బీర్‌ అలీలు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి రైల్వేస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నట్టు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటి విలువ 5 లక్షల వరకు ఉంటుందన్నారు. సమావేశంలో కామారెడ్డి రూరల్‌ సిఐ భిక్షపతి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌గౌడ్‌, సిసిఎస్‌ సిబ్బంది పెంటయ్య, ఉస్మాన్‌, తదితరులున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *