Breaking News

Daily Archives: December 28, 2017

గల్ప్‌ మోసాలపై ఉక్కుపాదం

  – నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో గల్ప్‌ ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు గల్ప్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్యువల్‌ క్రైమ్‌ రివ్యు-2017 సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో 2017 సంవత్సరంలో 6117 కేసులు నమోదైనట్టు, గత ఏడాదితో పోలిస్తే చైన్‌ స్నాచింగ్‌ కేసులు 8 శాతం ...

Read More »

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

  కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్కపతి గంగాధర్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, రమేశ్‌, రాంకుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బిజెపి మహిళా మోర్చా కమిటీ ఏర్పాటు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జిల్లాకార్యాలయంలో గురువారం నగర మహిళా మోర్చా కమిటీ నియమించారు. నగర ప్రధాన కార్యదర్శిగా పల్నాటి శ్రీలక్ష్మి, కార్యదర్శిగా శైలజను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ బిజెపి మహిళలకు పెద్ద పీట వేస్తుందని, కేంద్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి కీలకశాఖలు అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఒక్క మహిళను కూడా మంత్రిగా నియమించకపోవడం శోచనీయమని ...

Read More »

ఎమ్మెల్యేను కలిసిన ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శిగా ఎన్నికైన జగదీశ్వర్‌ నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తను గురువారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జగదీశ్వర్‌ బుధవారం క్లబ్‌ ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వర్‌ను అభినందించారు.

Read More »

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి వర్గీకరణ బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తు ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డివో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువసేన అధ్యక్షుడు ఓముల సురేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని వెంట తీసుకొని ఢిల్లీకి వెళ్లి శీతాకాల సమావేశాల్లో ఎస్‌సి లకు సంబంధించి ఎ,బి,సి,డి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. డప్పుకు, చెప్పుకు ...

Read More »

క్లోరో హైడ్రేట్‌ స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు బృందం బుధవారం రాత్రి సమయంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులో కల్తీకల్లు ఉత్పత్తికి ఉపయోగించే 56 కిలోల క్లోరోహైడ్రేట్‌ స్వాదీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ టాస్క్‌పోర్సు సిఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ముంబయి నుంచి జగిత్యాలకు వెళ్తున్న బస్సుపై తమ బృందం దాడిచేసి 56 కిలోల క్లోరోహైడ్రేట్‌ను, తరలిస్తున్న సునీల్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌, కిషన్‌గౌడ్‌లను అరెస్టు చేసి బస్సు సీజ్‌ చేసినట్టు ఆయన తెలిపారు. దాడుల్లో రాష్ట్ర టాస్క్‌ఫోర్సు ...

Read More »

నేడు హైదరాబాద్‌కు తరలిరావాలి

  కామరెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలబారత యాదవ కుర్మ మహాసభలకు జిల్లాలోని యాదవులందరు తరలిరావాలని సంఘం నాయకులు ప్రభాకర్‌యాదవ్‌, కుంబాల రవిలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం నూతన భవనాల నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ విచ్చేస్తున్నారని, అనంతరం అక్కడే సభ ఉంటుందన్నారు. యాదవులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణ యాదవ్‌, శంకర్‌, నర్సింలు, రమేశ్‌, తదితరులున్నారు.

Read More »

కంఠేశ్వర్‌ ఆలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులు మంజూరుచేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.జగన్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ డి.ఇ నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఈ విషయంపై ప్రకటన చేశారు. నిదులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, నిజామాబాద్‌ఎంపి కవితకు, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లకు జగన్‌ సన్మానించారు.

Read More »

ఘనంగా జన్మదిన వేడుకలు

  కామరెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగురాలైన శిరీష జన్మదిన వేడుకలను గురువారం విజ్ఞాన్‌ వికలాంగుల సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ కేక్‌కట్‌ చేసి వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

Read More »

బిసిటియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ క్యాలెండర్‌ను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి ఆవిష్కరించినట్టు బిసిటియు జిల్లా అధ్యక్షుడు మాడవేటి వేణు తెలిపారు. కార్యక్రమంలో బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామస్వామి, నాయకులు కె.రమేశ్‌, ఏ.శంకర్‌, అంజయ్య, మధు, రాజు, శ్రీనివాస్‌, రవి, శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కౌన్సిలర్‌ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్‌

  కామరెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండ్రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన బిజెఇ మాజీ పట్టణ అద్యక్షుడు లింబాద్రి కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతుడు లింబాద్రి ప్రస్తుతం కౌన్సిలర్‌ కావడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట తెరాస నాయకులు నంద రమేశ్‌, ఆంజనేయులు, బల్వంత్‌రావు, మామిండ్ల రమేశ్‌లు ఉన్నారు.

Read More »

బిటి రోడ్ల పరిశీలన

  కామరెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 15,16,17 వార్డుల్లో గురువారం వేసిన బిటి రోడ్లను స్థానిక వార్డు కౌన్సిలర్లు భూంరెడ్డి, పిట్ల వేణు, సంగిమోహన్‌లు పరిశీలించారు. నాణ్యతతో కూడిన రోడ్లు వేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. మరో రెండురోజుల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని సంబంధిత ఇంజనీర్‌ తెలిపారు.

Read More »

బాధితులకు దుస్తుల పంపిణీ

  కామరెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాత రాజంపేట గ్రామంలో రెండ్రోజుల క్రితం అగ్నిప్రమాదంలో నివాసపు గుడిసెలో వస్తువులు దగ్దమైన బాధిత కుటుంబానికి గురువారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దుస్తులు, వంట సామగ్రి అందజేశారు. బాధితులు రమేశ్‌, రాజు కుటుంబాలకు దుస్తులు అందించి ఓదార్చారు. కార్యక్రమంలో క్లబ్‌, బాంబే క్లాత్‌ యజమానులు రాజ్‌కుమార్‌, లాలు, రమేశ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, శ్యాంగోపాల్‌ తదితరులున్నారు.

Read More »

నిజాంసాగర్‌

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల, గుత్ప, అలాసాగర్‌ ఎత్తిపోతలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో గురువారం సమీక్ష సమావేశం జరిగింది. బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సిఇ ఆర్‌. మధుసూదన్‌రావు, ఎస్‌ఇ. గంగాధర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల కింద మొత్తం 2.10 లక్షల ...

Read More »

అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో కెసిఆర్‌ కిట్‌

  బీర్కూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అందించడమే కెసిఆర్‌ కిట్‌ ముఖ్య ఉద్దేశమని నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి సూపర్‌ వైజర్‌ శ్రీలత అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో అంగన్‌వాడిలకు కెసిఆర్‌ కిట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మొదటి, రెండవ గర్భ సమయంలో మరియు కాన్పు అయిన తర్వాత సర్కారు దవాఖాన, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో సేవలందుకున్న వారికి ఆర్థిక సహాయం మరియు కెసిఆర్‌ ...

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరిపై కేసు నమోదు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… బుధవారం రాత్రి బొమ్మన్‌దేవుపల్లి గ్రామం ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి బైక్‌ నడుపుతుండగా గుర్తించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గురువారం వారిని బాన్సువాడ కోర్టుకు పంపినట్టు వివరించారు. సదరు వ్యక్తులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో తిరిగి పట్టుబడితే జైలుకు ...

Read More »

ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి కృషి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు 2018 క్యాలెండర్‌ను మండలాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, మదన్‌సింగ్‌లు మండలంలోని ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై ఎల్లప్పుడు పోరాడే ఉపాధ్యాయ సంఘం పిఆర్‌టియు అన్నారు. మండలంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మండలంలోనే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని బిసి వసతి గృహ డివిజన్‌ అధికారి కేశవులు అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోగల బిసి బాలుర వసతి గృహాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలోని విద్యార్థుల సరుకుల రిజిష్టర్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు ప్రతినెల కాస్మొటిక్‌ చార్జీలు అందిస్తున్నారా అని అడిగారు. ప్రస్తుత చలికాలంలో విద్యార్థులకు దుప్పట్లు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

హైకోర్టు విభజనపై జాప్యమెందుకు? : ఎంపీ కవిత

న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన కోరుతూ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని కవిత ...

Read More »